శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రరూపం దాలుస్తోంది. పరిస్థితులు రోజురోజుకూ మరింతగా దిగజారుతున్నాయి. శ్రీలంకలో నెలకొన్న ఇంధన సంక్షోభం, ఆర్థిక సంక్షోభం, ఆహార సంక్షోభాలు తీవ్ర విషాదాన్ని మిగులుస్తున్నాయి. ప్రధానంగా ఇంధనం కోసం బంకుల జనం రోజుల ఎదురు చూస్తున్నారు. క్యూలో రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. అలా ఎదురు చూస్తూ.. క్యూలోనే ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఇటీవల పెరుగుతున్నాయి.


ఇప్పటి వరకూ ఇలా శ్రీలంకలో పెట్రోల్‌ బంకుల వద్ద క్యూలో నిల్చుని  పది వరకూ చనిపోయినట్టు శ్రీలంక మీడియా ద్వారా తెలుస్తోంది. వాహనంలో ఇంధనం నింపుకునేందుకు ఓ 63ఏళ్ల వృద్ధుడు ఐదురోజులపాటు ఎదురు చూసి.. చివరకు తన వాహనంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఇలా ఇంధనం కోసం క్యూలో మరణించడం ఇదో పదో సంఘటన అని అక్కడి మీడియా చెబుతోంది. ఇలా చనిపోయిన వాళ్లంతా 40 నుంచి 80ఏళ్ల మధ్య వారు కావడం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: