ఏపీ సీఎం జగన్.. చంద్రబాబు సొంత నియోజక వర్గాన్ని టార్గెట్ చేశారు. ఎలాగైనా ఈసారి చంద్రబాబును కుప్పంలో ఓడించాలని కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తున్నారు. అందుకే కుప్పం మునిసిపాలిటీకి రూ.66 కోట్లు మంజూరు చేస్తూ జీవో విడుదల చేసేశారు. కుప్పంలోని 25 వార్డుల్లో అభివృద్ధి పనుల కోసం రూ.67 కోట్లకు గతంలో వచ్చిన ప్రతిపాదనలకు ఓకే చెప్పేశారు. వారం క్రితం  కుప్పం నియోజకవర్గ వైసీపీ కార్యకర్తల సమావేశంలో అక్కడి అభివృద్ధిపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు.


కుప్పం తన సొంత నియోజకవర్గం పులివెందులతో సమానమంటున్న జగన్.. తాజాగా నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చారు. ఈ నిధులతో మురుగునీటి కాలువలు, తాగునీటి కోసం నూతనంగా బోర్లు, పైప్‌ లైన్లు, సిమెంట్‌ రోడ్లు వేస్తారు. అలాగే డ్రైనేజీ కాలువలు, అంగన్‌వాడీ, కమ్యూనిటీ భవనాల నిర్మాణం, దళవాయి, కొత్తపల్లె చెరువు కట్ట వద్ద పార్కు అభివృద్ధి చేస్తారు. వీటితో పాటు చెరువు నుంచి పట్టణానికి నీటి సరఫరా కోసం పైప్‌లైన్ల ఏర్పాటుకు ఈ నిధులను ఉపయోగిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: