జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ మొన్న ప్రధాని మోదీతో విశాఖలో భేటీ అయ్యారు. ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా ఆయన ఈ సమావేశానికి హాజరయ్యారు. బీజేపీ, జనసేన కలిసి పనిచేయాలని గతంలోనే నిర్ణయించాయి. కానీ.. ఈ రెండు పార్టీల మధ్య ప్రస్తుతం అంత సఖ్యత కనిపించడం లేదు. పైగా జనసేన ప్రస్తుతం టీడీపీ వైపు మొగ్గు చూపుతోంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ మోదీతో భేటీ కావడం ఆసక్తి రేపింది.


అయితే.. ఈ భేటీపై వైసీపీ నాయకులు సెటైర్లు వేస్తున్నారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీరుపై మంత్రి అంబ‌టి రాంబాబు త‌న‌దైన శైలిలో స్పందించారు. ప్రధాని న‌రేంద్ర మోదీతో మీటింగ్‌..టీడీపీ నేత చంద్ర‌బాబుతో డేటింగ్ అంటూ అంబ‌టి రాంబాబు వెటకారం చేశారు. విశాఖ ప‌ర్యట‌న‌కు వ‌చ్చిన ప్రధాని న‌రేంద్ర మోదీతో ప‌వ‌న్ క‌లిసిన విష‌యాన్ని ప్రస్తావిస్తూ ఇలా రైమింగ్‌ గా స్పందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: