జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. కాపులు ఎవరితో ఉండాలో తెల్చుకోవాలని మంత్రి అంబటి రాంబాబు సూచించారు. జగన్ రెడ్డిని నమ్ముకున్న నాతోనో చంద్రబాబు కు ఊడిగం చేస్తున్న పవన్ తోనో తేల్చుకోవాలని మంత్రి అంబటి రాంబాబు సూచించారు. బుద్ధి జ్ఞానం లేని పవన్ కు రాజకీయాలు తెలుసా అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. వైసీపీ కి అధికారం రానివ్వకుండా చేయటానికి పవన్ పెద్ద మాగాడేమి కాదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.


కాపులు మా పవన్ మా పవన్ అంటూ గోక్కొటున్నారని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. గొక్కొని  గొక్కొని చంద్రబాబు దగ్గర పవన్ తో కలసి చాకిరి చేయండని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఒక్కచోట కూడా గెలవలేని పవన్ నాపై ఆరోపణలు ఎలా చేస్తారని మంత్రి అంబటి ప్రశ్నించారు. చంద్రబాబు కాళ్లమీద పడి పవన్ ను ఏడవమని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. వైసీపీ లో నేను విమర్శించినంత ఘాటుగా ఎవరు  విమర్శించరని.. అందుకే నాపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి అంబటి అన్నారు. ఒక్క పైసా అశించని నాపై ఆరోపణలు చేస్తారా అని రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: