టీడీపీ అధినేత నారా చంద్రబాబు జైలుకు వెళ్లారు. ఆయనకు కోర్టు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. అయితే కోర్టులో చంద్రబాబును చూసి సతీమణి భువనేశ్వరి ఒక్కసారిగా కంటతడి పెట్టుకున్నారని తెలిసింది. ఎందుకంటే ఇవాళే వారి పెళ్లిరోజు కూడా. చంద్రబాబును కలిసేందుకు కుటుంబ సభ్యులు ఏసీబీ కోర్టు హాల్‌కు వచ్చిన సమయంలో పెళ్లిరోజునే చంద్రబాబును అలా చూసి ఆయన సతీమణి నారా భువనేశ్వరి కంటతడిపెట్టారు.


చంద్రబాబుకు కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో ఆయన సతీమణి భువనేశ్వరి ఎంతో భావోద్వేగం చెందారు. ఏసీబీ కోర్ట్ హాలుకు వెళ్లి చంద్రబాబును భువనేశ్వరి పరామర్శించారు. చంద్రబాబును చూసి ఆమె భావోద్వేగాన్ని నియంత్రించుకోలేకక కన్నీటి పర్యంతమయ్యారు. రిమాండ్ విధిస్తూ కోర్ట్ తీర్పు ఇచ్చిన తర్వాత చంద్రబాబును కలిసేందుకు కుటుంబ సభ్యులు ఏసీబీ కోర్టు హాల్‌కు వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. వివాహ వార్షికోత్సవం రోజునే చంద్రబాబును జైలుకు తరలించడం కలచివేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: