ఇవాళ విజయవాడలో వైయ‌స్ఆర్‌సీపీ పదాధికారుల సమావేశం జరగబోతోంది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సభకు రాష్ట్రం నలమూలల నుంచి పార్టీ శ్రేణులు భారీగా  హాజరవుతారు. మొత్తం 8,222 మంది వరకు ప్రతినిధులు హాజరవుతారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల సమావేశం ఏర్పాట్లను పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి  సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి జోగిరమేష్, పార్టీ అనుబంధ విభాగాల ఇన్ ఛార్జ్  చెవిరెడ్డి , ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ పరిశీలించారు.

వైసీపీ పార్టీ ప్రతినిధులలో ఎవరెవరు ఏ ఏ ప్రవేశమార్గాల నుంచి సమావేశమందిరంలోకి ప్రవేశిస్తారనే అంశంపై పరిశీలించారు. వైసీపీ పార్టీ అధ్యక్షులు, రాష్ర్ట ముఖ్యమంత్రి  వైయస్ జగన్ హాజరవుతున్న దృష్ట్యా అన్ని రకాల భధ్రతా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలకు, ట్రాఫిక్ కు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసే క్రమంలో భాగంగా ప్రభుత్వం చేస్తున్న అభివృధ్ది-సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకువెళ్ళే ఆలోచనతో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: