కాళేశ్వరం ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించామని కేసీఆర్ సర్కారు ఇన్నాళ్లూ ప్రచార చేసుకుంటోంది. అలాంటి మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్ తాజాగా కుంగడంతో ప్రమాదంలో పడింది. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ఇంజనీర్లు పరిశీలించడానికి వెళ్తే పోలీసులు  అడ్డుకుంటున్నారని.. విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కెసిఆర్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా నిర్మించారని.. 80 వేల పుస్తకాలు చదివి ముఖ్యమంత్రి కేసిఆర్ కాళేశ్వరాన్ని నిర్మించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.


భారీ ఎత్తున నిధులు కేటాయించి నిర్మించిన ప్రాజెక్ట్ కుంగిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది ప్రభుత్వం చెప్పాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. తెలంగాణ ప్రజల జీవన విధానాన్ని దెబ్బతీసిన ప్రోజెక్ట్ ఇదన్నారు. ఎంతో మంది నిపుణులు చెప్పిన వినకుండా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ను నిర్మించారని... ఇప్పుడు డ్యాం పిల్లర్లు కుంగిపోయిన పరిస్థితి చూస్తున్నామని.. -డ్యాం సేఫ్టీ అథారిటీతో బృందాలతో ప్రాజెక్ట్ ను పరిశీలించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. మరి కేంద్రం ఈ ప్రాజెక్టుపై దర్యాప్తు చేయిస్తుందా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: