తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ బిగ్ షాక్ ఇచ్చారు. ఓటుకు నోటు కేసు విచారణను హైదరాబాద్ నుంచి మార్చాలని సుప్రీంకోర్టులో పిటీషన్ వేయించారు. కేసు విచారణ ను భోపాల్ కు బదిలీ చేయాలన్న వ్యవహారం పై తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి, ఇతర ప్రతివాదులకు జస్టిస్‌ బిఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతా ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. సీఎం, హోం మంత్రి గా రేవంత్‌ ఒకరే బాధ్యతలు నిర్వహిస్తున్నారని.. వెంటనే ట్రయల్ కూడా మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తమకు సమాచారం ఉందన్న పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు.


ఇప్పటికిప్పుడు ట్రయల్ మొదలైతే... విచారణ పై ప్రభావం చూపే అవకాశం ఉందని ధర్మాసనం దృష్టికి పిటిషనర్ జగదీష్ రెడ్డి తరపు న్యాయవాది మోహిత్ రావు  తీసుకువచ్చారు. ఒకవేళ ట్రయల్ పై అలాంటి ప్రభావం ఉందనుకుంటే తాము ఎలా చూస్తూ ఉంటామని జస్టిస్ బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. మరి ఈ కేసు ఏం మలుపు తిరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: