టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రతీకార చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా అనంతపురం వైసీపీ మాజీ ఎంపీ, ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డిపై సీఎం చంద్రబాబు నాయుడుకు రిటైర్డ్ అదనపు ఎస్పీ బాల నరసింహారెడ్డి ఫిర్యాదు చేశారు. అనంతపురం నగరంలో అక్రమాలు అవినీతి కి పాల్పడిన అనంత వెంకట్రామిరెడ్డి పై విచారణ జరిపించాలని సీఎంను కోరారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో నగరంలో రహదారి విస్తరణ పనుల్లో మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి అక్రమాలకు పాల్పడి పెద్ద ఎత్తున వసూళ్లు చేశాడని ఆరోపించారు.

అనంత వెంకట్రాంరెడ్డి తమ్ముళ్ళతో కలిసి నగరంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని బాల నరసింహారెడ్డి ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఇంటిపై నిర్మించిన షెడ్డుకు ఆస్తి పన్ను ఎగ్గొట్టారని ఆరోపించారు. అనంత వెంకట్రామిరెడ్డి ఇంటిపై అక్రమంగా నిర్మాణాలు చేశారని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అంటే ఇక ఆ మాజీ ఎమ్మెల్యే నివాసాలపైకి జేసీబీలు వెళ్లనున్నాయా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: