భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో దాడులు జరుగుతూనే ఉన్నాయి. పాకిస్థాన్ ఎన్నో విధాలుగా భారత్ ని ఓడించేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఫలితం లేకపోయింది. అయితే ఇటీవల పాకిస్థాన్ ఇండియాపైన సైబర్ దాడి చేసేందుకు పాల్పడిందని వార్తలు, ఫేక్ పోస్టులు వచ్చాయి. సైబర్ దాడి కారణంగా భారత్ లో 70శాతం ఎలెక్ట్రిక్ గ్రిడ్ పనిచేయట్లేదు అంటూ సోషల్ మీడియా వేదికగా కూడా పోస్టులు వచ్చాయి. దీంతో భారతీయులు తీవ్ర ఆందోళనకు గురైయ్యారు.

అయితే తాజాగా పీఐబీ దీనిపై ఫ్యాక్ట్ చెక్ చేసింది. ఆ ప్రచారం తప్పుడు ప్రచారం అని తేల్చింది. పాకిస్థాన్ ఎలాంటి సైబర్ దాడికి పాల్పడలేదని తేలింది. పాకిస్థాన్ కావాలనే మరోసారి నకిలీ ప్రచారం చేసిందని స్పష్టం అయ్యింది. అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దు అంటూ పీఐబీ సూచనలు ఇచ్చింది. ఈ తప్పుడు ప్రచారాన్ని అస్త్రంగా వాడుకుని భారత్ పై విజయం సాధించాలి అనుకుంది. కానీ పాకిస్థాన్ మరోసారి విఫలం అయింది. ఇక ఆ పోస్ట్, ప్రచారం, సైబర్ దాడి ఫేక్ అని తేలడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.

ఇకపోతే పాకిస్థాన్ మరోసారి దాడులు ప్రారంభించిన విషయం తెలిసిందే. దీంతో భారత్ కొన్ని నగరాలకు బ్లాక్ అవుట్ విధించింది. దాడులను అడ్డుకునేందుకు భారత్ ఆర్మీ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. డ్రోన్ లను తిప్పికొడుతూ భారత్ ని సురక్షితంగా ఉంచుతోంది. . భారత్ వరుస దాడులతో పాకిస్థాన్ ని ముప్పు తిప్పలు పెడుతుంది. భారత్ ఆర్మీ పాకిస్తాన్ టెర్రరిస్టులను ఒక్కొక్కరిగా కలుపు మొక్కలను ఏరిపారేసినట్టు ఏరిపారేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: