ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ( ఈపీఎఫ్‌వో) పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్ లో పెన్షనర్లు, సబ్‌స్క్రైబర్లు ఈపీఎఫ్‌వోకు షాక్ ఇచ్చారు. నెలకు కనీస పెన్షన్ 7,500 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కనీస పెన్షన్ పెంచని పక్షంలో దేశవ్యాప్తంగా సమ్మెకు దిగుతామని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
రామ్ లీలా మైదాన్ లో శనివారం రోజున 27 రాష్ట్రాలకు చెందిన ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ పెన్షనర్లు కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. చాలా కాలంగా పెన్షనర్లు కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రధానమంత్రి కార్యాలయానికి కూడా పెన్షనర్లు వెళ్లి అధికారులకు మెమోరాండమ్ సమర్పించారు. 
 
పదవీ విరమణ చేసిన ఉద్యోగుల గురించి ఈపీఎఫ్‌వో పట్టించుకోవడం లేదని, ఈపీఎఫ్‌వో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పెన్షనర్లు చెబుతున్నారు. ప్రభుత్వం కనీస పెన్షన్ విషయంలో స్పందించకపోతే మాత్రం పెన్షనర్లు జనవరి నెల 25వ తేదీ నుండి సమ్మెకు దిగుతారని తెలుస్తోంది. ఒక నిరసనకారుడు మాట్లాడుతూ ప్రావిడెంట్ ఫండ్ డబ్బుల వలన సామాజిక ఆర్థిక భద్రత కలగాలని కోశియారీ కమిటీ ప్రతిపాదనలకు అనుగుణంగానే మా డిమాండ్లు ఉన్నాయని చెప్పారు. 
 
ప్రస్తుతం ఈపీఎఫ్‌వో సబ్ స్క్రైబర్లు రిటర్మెంట్ తరువాత కనీస పెన్షన్ 2,500 రూపాయలు పొందుతున్నారని తెలుస్తోంది. కోశియారీ కమిటీ 2013 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి కనీస పెన్షన్, డీఏలకు సంబంధించిన ప్రతిపాదనలను, భాగస్వామి మరణిస్తే విడోకు ఆర్థిక భద్రత కల్పించాలని సిఫార్సు చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: