ప్రైవేట్ రంగానికి చెందిన అతిపెద్ద బ్యాంకులలో ఒకటైన యస్ బ్యాంక్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఆర్బీఐ యస్ బ్యాంక్ ఖాతాదారులు 50,000 రూపాయలకు మించి నగదు విత్ డ్రా చేసుకోవడానికి వీలు లేదని స్పష్టం చేసింది. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో యస్ బ్యాంక్ కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం ప్రభావం పరోక్షంగా ఫోన్‌పే కస్టమర్లపై పడింది. 
 
నిన్న రాత్రి నుండి చాలామంది ఫోన్‌పే కస్టమర్లు లావాదేల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫోన్‌పే కస్టమర్లకు నిన్న రాత్రి నుండి చుక్కలు కనిపిస్తున్నాయి. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం ప్రభావం డిజిటల్ పేమెంట్స్ పై పడింది. మెజారిటీ శాతం యూపీఐ ఆధారిత లావాదేవీలు స్తంభించిపోయాయి. ఇతర యూపీఐలతో పోలిస్తే ఫోన్‌పే యూజర్లపై ఈ ప్రభావం మరింతగా పడింది. 
 
ఫోన్‌పే కు యస్ బ్యాంక్ అతి పెద్ద పేమెంట్ భాగస్వామిగా ఉండటంతో ఫోన్‌పే కస్టమర్లు ఇబ్బందులు పడ్డారు. ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో ఫోన్‌పే లావాదేవీల విషయంలో కస్టమర్లు అసౌకర్యానికి గురవుతున్నారు. మరోవైపు ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో కస్టమర్లు ఆందోళన పడుతున్నారు. ఆర్బీఐ యస్ బ్యాంక్ బోర్డును రద్దు చేయడంతో కస్టమర్ల ఆందోళన రెట్టింపయ్యింది. ఆర్బీఐ అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే కస్టమర్లకు 5 లక్షల రూపాయల వరకు ఇచ్చేందుకు అనుమతిచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: