అవును.. ఇది నిజంగా శుభవార్తే.. కానీ ఈ శుభవార్తతో వాహనదారులకు పెద్దగా ఉపయోగం లేదు.. ఎందుకంటే కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రజలంతా కూడా ఏప్రిల్ 14వ తేదీ వరుకు ఇంటికే పరిమితం అవ్వాలి కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ప్రజలంతా కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. అయితే కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ పొడిగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

 

ఇకపోతే పెట్రోల్, డీజిల్ ధరలు ఇదే కరోనా వైరస్ కారణంగా కేవలం మూడు రోజుల్లో నాలుగు రూపాయిలు తగ్గిపోయాయి.. ఆ తర్వాత కూడా పైసా పైసా తగ్గుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుండి స్థిరంగా కొనసాగుతున్నాయి.. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు అతి దారుణంగా తగ్గిపోయాయి.. అయితే ఇప్పటికి ఆ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుండా.. తగ్గకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి.. ఇది నిజంగా ఒక రకంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. 

 

ఏమైతేనేమి పెట్రోల్, డీజిల్ ధరలు అతి భారీగా తగ్గిపోయాయి.. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా కొనసాగుతున్నాయి.. లీటర్ పెట్రోల్ ధర రూ.73.97 వద్ద, డీజిల్ ధర రూ.67.82 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా తగ్గాయి. ఇంకా దేశ రాజధాని ఢిల్లీలో, ఆర్ధిక రాజధాని ముంబైలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే స్థిరంగా కొనసాగుతున్నాయి. లాక్ డౌన్ అనంతరం పెట్రోల్, డీజిల్ ధరలపై ఒక్కో రూపాయి పెరిగే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: