ప్రధాని మోదీ మరోసారి లాక్ డౌన్ ను పొడిగించడంతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైలు ప్రయాణికులకు మరోసారి భారీ షాక్ ఇచ్చింది. ఇప్పట్లో రైళ్ల సర్వీసులను పునరుద్ధరించే ఉద్దేశం లేదని.... మే 3వ తేదీ వరకు ప్యాసింజర్ రైళ్లు తిరగవని స్పష్టం చేసింది. అప్పటివరకు రైళ్ల బుకింగ్ లను కూడా ఆపివేస్తున్నట్లు పేర్కొంది. మే 3వ తేదీ వరకు ఆన్ లైన్ లో , రైల్వే బుకింగ్ కౌంటర్లలో టికెట్ కొనుగోలు చేసే అవకాశం ఉండదని పేర్కొంది. 
 
గత కొంతకాలం నుంచి రైల్వే శాఖ ఏప్రిల్ 15 నుంచి రైలు సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నట్టు వార్తలు వచ్చాయి. రైల్వే శాఖ కొన్ని ప్రత్యేక సర్వీసులను నడిపే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే వైరల్ అవుతున్న ఆ వార్తలను నమ్మవద్దని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ప్రధాని మోదీ మే 3 వరకు లాక్ డౌన్ ను పొడిగించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. 
 
అయితే రవాణా వాహనాలు మాత్రం యథావిధిగా తిరుగుతాయని రైల్వే శాఖ ప్రకటించింది. ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఏప్రిల్ 20 వరకు లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలవుతాయని.... ఆ తర్వాత ఆంక్షలను సడలించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య సేతు యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. అన్ని రాష్ట్రాలు ప్రోటోకాల్ ను తప్పక పాటించాల్సిందేనని పేర్కొన్నారు. రేపు తాము మరికొన్ని మార్గదర్శక సూత్రాలను ప్రకటిస్తామని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: