క్యాష్ లెస్ పెమెంట్స్ ను ఇప్పుడు ఎక్కువగా చేస్తున్నారు.. ముఖ్యంగా ఆన్ లైన్ లావా దేవీలు చేసే వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువయ్యింది. కష్టమర్ల అవసరాల మేరకు మని ట్రాన్స్ఫర్ యాప్ లు కూడా మంచి ఆఫర్లను , క్యాష్ బ్యాక్ ను అందిస్తున్నారు. గూగుల్ పే , పేటీఎం, ఫోన్ పే వంటి యాప్ లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. తాజాగా పేటీఎం మరో కొత్త ఆఫర్ ను అందిస్తుంది. పోస్ట్‌పెయిడ్ సర్వీస్ యూజర్లు వారి నెలవారీ బిల్లును ఇక పై సులభ ఈఎంఐ రూపంలో మార్చుకోవచ్చు. అంతే కాకుండా తక్కువ వడ్డీ రేట్ల తోనే ఈ బెనిఫిట్ పొందొచ్చని కంపెనీ తెలిపింది. ఆన్ లైన్ మనీ ట్రాన్స్ఫర్ యాప్ లలో ఈ యాప్ మంచి క్యాష్ బ్యాక్ ను అందిస్తుంది.



సాధారణంగా పేటీఎం పోస్ట్ పెయిడ్ కస్టమర్లు వారి బిల్లు జనరేట్ అయిన తర్వాత వారం రోజుల్లో ఆ బిల్లు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అలా ప్రతి నెలా కట్టవలసి వస్తుంది.. అయితే ఇప్పుడు పేటీఎం మరో కొత్త ఆఫర్ ను అందుబాటు లోకి తీసుకొచ్చింది. కస్టమర్లు వారి బిల్లు మొత్తాన్ని ఈఎంఐలోని మార్చుకోవచ్చు. ఇకపోతే పేటీఎం పోస్ట్ పెయిడ్ ద్వారా కస్టమర్లకు రూ.లక్ష వరకు క్రెడిట్ లిమిట్ లభిస్తోంది..



ఇలా చేయడం వల్ల కస్టమర్లకు  మంచి ఆఫర్, సేవింగ్ తో పాటుగా నచ్చిన ప్రొడక్టులు కొనుగోలు చేయొచ్చు.
పేటీఎం పోస్ట్‌పెయిడ్ ‌లో మూడు రకాలు ఉంటాయి. పోస్ట్‌పెయిడ్ లైట్ యూజర్లు రూ.20,000 వరకు క్రెడిట్ లిమిట్ పొందుతారు. క్రెడిట్ స్కోర్ లేని వారు కూడా ఈ బెనిఫిట్ పొందొచ్చు. డిలైట్ అండ్ ఎలైట్ కస్టమర్లు రూ.లక్ష వరకు క్రెడిట్ లిమిట్ పొందొచ్చు పెటీఏం వెల్లడించింది. దీంతో ఇప్పుడు కస్టమర్లకు మంచి బెనిఫిట్స్ ఉండటం తో ఎక్కువ మంది పేటీఎం ద్వారా  లావాదేవీలను చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: