గోవాకి చెందిన విద్యుత్తు వాహ‌న‌ కంపెనీ కబీరా మొబిలిటీ  కెఎమ్ 3000 మరియు కెఎమ్ 4000 అనే రెండు ఎలక్ట్రిక్ మోటార్ ‌సైకిళ్లను భారత మార్కెట్‌కు పరిచయం చేసింది. మార్కెట్లో వీటి ప్రారంభ ధర రూ.1.27 లక్షలు (ఎక్స్-షోరూమ్, గోవా).  బుకింగ్స్ ప్రారంభించిన నాలుగు రోజుల్లోనే ఇవి పూర్తిగా అమ్ముడుపోయిన‌ట్లు కంపెనీ ప్ర‌క‌టించింది.

కెఎమ్ 4000 నేక్డ్ స్ట్రీట్ ఫైటర్ బైక్‌గా ఉంది. దీనిని కవాసకి జెడ్1000 మోడల్ స్పూర్తి. ఫ్రంట్ హెడ్‌ల్యాంప్ మాత్రం యమహా ఎఫ్‌జెడ్-ఎస్ మోడల్ మాదిరిగా ఉంది. కబీరా కెఎమ్ 3000 ఫుల్ ఫెయిర్డ్ మోటార్‌సైకిల్ అయినప్పటికీ ఇది 138 కిలోల బరువును కలిగి ఉంటుంది. ఈ రెండు ఎలక్ట్రిక్ మోటారు సైకిళ్ళు వేర్వేరు సస్పెన్షన్ సెటప్‌లను కలిగి ఉంటాయి. కెఎమ్ 3000 మోడల్‌కు స్టాండర్డ్ టెలిస్కోపిక్ ఫోర్కులున్నాయి. టాప్-రేంజ్ వేరియంట్ అయిన కెఎమ్4000 యూఎస్‌డి (అప్ సైడ్ డౌన్) ఫ్రంట్ ఫోర్కులను కలిగి ఉంది. బ్రేకింగ్ ఫీచర్ మాత్రం రెండు మోడళ్లలో ఒకేలా ఉంటుంది. ఈ రెండు వేరియంట్లలో ముందు, వెనుక  స్టాండర్డ్ సింగిల్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. ఇవి కాంబీ బ్రేక్ సిస్టమ్‌ను సపోర్ట్ చేస్తాయి.

కెఎమ్ 3000 ఎలక్ట్రిక్ బైక్‌లో 6 కిలోవాట్ డెల్టివ్ బిఎల్‌డిసి మోటార్‌ను వాడారు. ఈ మోటార్ 4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఇది సింగిల్ చార్జ్‌పై 120 కి.మీ రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 100 కి.మీ. కేవలం 3.1 సెకన్లలోనే గంటకు 0-40కి.మీ వేగాన్ని చేరుకుంటుంద‌ని కంపెనీ తెలిపింది.

కెఎమ్ 4000 ఎలక్ట్రిక్ బైక్‌లో 8 కిలోవాట్ డెల్టివ్ బిఎల్‌డిసి మోటార్‌ను వాడారు ఈ మోటార్ 4.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. 50 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. గరిష్టంగా గంటకు 120 కి.మీ వేగంతో ప‌రిగెడుతుంది. ఇది కేవలం 3.1 సెకన్లలోనే గంటకు 40 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. ఈ రెండు ‌బైక్స్ ఎకో మరియు బూస్ట్ అనే రెండు రకాల చార్జింగ్‌లను సపోర్ట్ చేస్తాయి.ఎకో ఛార్జ్ ద్వారా బ్యాటరీ ప్యాక్‌లను పూర్తిగా చార్జ్ చేయటానికి 6 గంటల 30 నిమిషాల సమయం పడుతుంది. బూస్ట్ చార్జ్ ద్వారా అయితే కేవలం రెండు గంటల్లోనే 0 నుండి 80 శాతం వరకూ ఛార్జింగ్ చేసుకునే స‌దుపాయాన్ని క‌ల్పించిన‌ట్లు కంపెనీ వెల్ల‌డించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: