ఒకవేళ చంద్రబాబు సీఎం గా ఉన్న సమయంలో ఇవే పెట్టుబడులు పెడితే ఆయన్ను చూపించే విధానం పూర్తిగా మారిపోయేది. ప్రపంచంలోనే అపర కోటీశ్వరుడిని ఏపీకి తీసుకువచ్చిన ఘనత చంద్రబాబుదే అనే కోణంలో వార్తలు ఉండేవేమో.. ఆయన ఏపీలో పెట్టుబడులు పెట్టడం శుభపరిణామం అనేలా వార్తలు ఉండేవి.
కానీ జగన్ అధికారంలో ఉండే సరికి ఈ క్రెడిట్ అంతా ఏపీ సీఎం కే వెళ్తోంది అనే ఉద్దేశంతో విషపు రాతలకు పూనుకుంది. వాస్తవానికి ఏపీ సీఎం జగన్ తో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి, గౌతమ్ అదానీకి సత్సంబంధాలు ఉన్నాయి. దీనికి సాక్ష్యమే అంబానీ మనిషికి జగన్ రాజ్యసభ ఎంపీ సీటు ఇవ్వడం. తెరవెనుక ఏం జరిగినా.. అంతిమంగా ఏపీకి లాభం చేకురిస్తుందా లేదా అనే విషయాన్ని మాత్రమే మనం చూడాలి.
ఏపీలో గౌతమ్ అదానీ అనేక సోలార్ పెట్టుబడులు పెడుతున్నారు. జగన్ ఇండస్ర్టీలిస్ట్ అయితే చంద్రబాబు బిజినెస్ మ్యాన్. తాజాగా అదానీ బీచ్ సాండ్ ప్రాజెక్టులో భాగస్వామి అవుతున్నారు. ఇది దేశానికి నష్టం అనే కోణంలో ఓ వార్తాపత్రిక కథనాలు ప్రచురిస్తోంది. ఇది భారతీయ కంపెనీ యే అనే విషయం మరచిపోతున్నారు. పెట్టుబడుతు పెడితే ఒక విధంగా పెట్టకపోతే మరోలా వార్తలు రాస్తున్నారు. మరోవైపు అదానీ వచ్చి పెట్టుబడులు పెడుతుంటే ఎందుకింత అసహనం అనేది అర్థం కావడం లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి