ప్రపంచ వ్యాప్తంగా ఈ మధ్య కాలంలో అనేక పరిస్థితులు ఏర్పడ్డ కారణంగా భారతీయ స్టాక్ మార్కెట్ ఈ సంవత్సరం ప్రారంభం నుండి అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ వస్తుంది. ఇక కొంత కాలం క్రితం భారతీయ స్టార్క్ మార్కెట్లు అమాంతం పడిపోయాయి. దానితో భారతీయ స్టాక్ మార్కెట్ను నమ్ముకొని అందులో అనేక పెట్టుబడులు పెట్టిన వారంతా పెద్ద మొత్తంలో నష్టాలలోకి వెళ్ళిపోయారు. అలా భారీ నష్టాల్లోకి వెళ్లిపోయిన తర్వాత గత పది రోజుల నుండి భారతీయ స్టాక్ మార్కెట్లో కాస్త లాభాల్లో పయనించాయి. దానితో భారతీయ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారంతా కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అలా ఊపిరి పీల్చుకున్నారో లేదో మళ్లీ భారతీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లోకి వెళ్లిపోతుంది. తాజాగా ఈ రోజు స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ప్రారంభం అయింది.

ఈ రోజు సెన్సెక్స్ 730 పాయింట్లు నష్టపోయి 81,445 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతూ ఉండగా , అల్ట్రాటెక్ , M&M , యాక్సిస్ బ్యాంక్ , NTPC గ్రీన్ , పవర్ గ్రిడ్ ,  JSW స్టీల్ , రిలయన్స్ , ITC  , tcs , ICICI, టైటాన్ షేర్లు ఈ రోజు నష్టాల్లో స్టార్ట్ అయ్యాయి. ఇక భారత్ ఎలక్ట్రానిక్ , ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు మాత్రం ఈ రోజు లాభాల్లో ప్రారంభం అయ్యాయి. గత కొన్ని రోజుల నుండి లాభాల్లో పయనిస్తున్న ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈ రోజు నష్టాల్లో స్టార్ట్ కావడంతో మరి ఈ రోజు మధ్యాహ్నం వరకైనా భారతీయ స్టాక్ మార్కెట్ లాభాల్లోకి వస్తుంది అని కొంత మంది భావిస్తున్నారు. మరి ఈ రోజు మధ్యాహ్నం వరకు ఇండియన్ స్టాక్ మార్కెట్ లాభాల్లోకి వస్తుందా ... లేక ఇలాగే ఈ రోజు స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగుస్తుందా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: