మ్యూల్ అకౌంట్స్ ను కట్టడి చేయడానికి RBI గవర్నర్ ను కోరారు.రాబోయే పండుగల సమయంలో సైబర్ మోసాలు పెరిగే అవకాశం ఉందని సజ్జనార్ హెచ్చరించారు. సంక్రాంతి క్రిస్మస్ సందర్భంగా ఆఫర్ల పేరుతో నేరగాళ్లు మోసాలు చేస్తారని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. RBI UDGAM పోర్టల్ పేరుతో స్కామర్లు లింకులు పంపి మోసాలు చేస్తున్నారని ఆయన వివరించారు.
ఆ లింకులు క్లిక్ చేస్తే ఫోన్ హ్యాక్ అవుతుందని హెచ్చరికలు జారీ చేశారు. సైబర్ క్రైమ్ యూనిట్ APK ఆధారిత మోసాలను రిసాల్వ్ చేసిందని తెలిపారు.
డ్రగ్ నేరగాళ్లను హిస్టరీ షీటర్లలా మానిటర్ చేస్తామని ప్రకటించారు. మ్యూల్ హంటర్ టూల్ ను బ్యాంకుల్లో అమలు చేయాలని RBI ను కోరారు. స్టూడెంట్స్ ను మ్యూల్ అకౌంట్స్ లోకి లాగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ మోసాలు ఆక్సిజన్ లా మ్యూల్ అకౌంట్స్ పై ఆధారపడతాయని చెప్పారు. ఫైనాన్షియల్ క్రైమ్ ప్రివెన్షన్ మెరుగుపరచాలని సూచించారు.సైబర్ నేరాల నిర్మూలనకు పోలీసు శాఖ చర్యలు తీవ్రతరం చేస్తోందని సజ్జనార్ తెలిపారు. గోల్డెన్ అవర్ రిపోర్టింగ్ ద్వారా మోసాలు రిసాల్వ్ చేస్తున్నామని చెప్పారు. అనుమానాస్పద లింకులు క్లిక్ చేయకూడదని ప్రజలకు సలహా ఇచ్చారు.
9490520108.. వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి