టాలీవుడ్, బాలీవుడ్ , కొలీవుడ్ లో గ్లామర్ బ్యూటీగా పేరు సంపాదించింది హీరోయిన్ తమన్నా. తన అందం అభినయంతో, డాన్స్ తో ఎంతోమందిని ఆకట్టుకుంది.ఈరోజు తమన్నా 36వ పుట్టినరోజు సందర్భంగా తమన్నా గురించి కొన్ని విషయాలు వైరల్ గా చేస్తున్నారు అభిమానులు. ముఖ్యంగా తమన్నా హీరోయిన్గా ఎలా జరిగింది అనే విషయం గురించి చూద్దాం.



తమన్నా 1989 డిసెంబర్ 21 సింధీ కుటుంబంలో జన్మించారు. తమన్నాకు చిన్న వయసు నుంచే ఎక్కువగా కళల పట్ల ఆసక్తిగా ఉండడంతో 13 ఏళ్ల వయసులోనే నటనలో శిక్షణ పొందింది. అలా 15 ఏళ్లకే చాంద్ సా రోషన్ చెహ్ర చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తెలుగులో మాత్రం శ్రీ అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదట్లో అంతగా గుర్తింపు రాలేదు. కానీ 2007లో వచ్చిన హ్యాపీడేస్ సినిమాతో క్రేజ్ అందుకుంది. ఆ తర్వాత కాళిదాసు సినిమాతో పేరు సంపాదించిన ఈ ముద్దుగుమ్మ రెడీ, ఆవారా, 100 %లవ్, రచ్చ, ఊసరవెల్లి, తడాఖా, తదితర చిత్రాలలో నటించింది.


చాలామందికి తెలియని విషయం ఏమిటంటే తమన్నా సినిమాలలో నటిస్తున్నప్పుడు వరుసపరాజయాలు ఎదురవ్వడంతో న్యూరాలజీని నమ్మి  తన పేరుని మార్చేసింది. Tamanna.. Tamannaah. ఇలా పేరు మార్చుకున్నప్పటి నుంచి వరుసగా విజయాలు అందుకుంటోంది. తమన్నా హీరోయిన్గా ఎంతోమంది స్టార్ హీరోల చిత్రాలలో నటించింది. అలాగే పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో నటించడమే కాకుండా స్పెషల్ సాంగులలో కూడా ఆకట్టుకుంది. తమన్నా కేవలం హీరోయిన్ గానే కాకుండా బిజినెస్ ఉమెన్ గా కూడా పేరు సంపాదించింది. వైట్ అండ్ గోల్డ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉంది. తన తండ్రి చేస్తున్న డైమండ్ బిజినెస్ ని కూడా సక్సెస్ ఫుల్ గా నడిపిస్తోంది తమన్నా. తమన్నా సినీ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం  రేంజర్, వావన్, ఓ రోమియో పాటుగా మరో రెండు చిత్రాలు ఉన్నాయి.ప్రముఖ బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో బ్రేకప్ అయినట్టుగా బాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: