వైయస్ జగన్మోహన్ రెడ్డి.. ఈయన పేరు తెలియని భారత దేశ ప్రజలు ఉండరు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి పేరు చాలా పాపులర్.. చిన్న వయసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం అయి చంద్రబాబు లాంటి ఎంతో రాజకీయ చతురత ఉన్న సీనియర్ నాయకుడిని ఓడించి సీఎం పీఠాన్ని అధిరోహించారు. అయితే అలాంటి జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. అయితే ఈయన ఘోర ఓటమి పాలవ్వడానికి ప్రధాన కారణం చంద్రబాబు, బిజెపి,జనసేనతో పొత్తు పెట్టుకోవడమే. ఒకవేళ టిడిపి, జనసేన, బిజెపి కలవకపోతే కచ్చితంగా వైయస్సార్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చేది. కానీ జగన్మోహన్ రెడ్డిని తొక్కడం కోసం మూడు పార్టీలు జతకట్టాయి. దాంతో 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమయ్యారు.

 కానీ ఆయన ఓట్ షేరింగ్ మాత్రం ఎక్కడికి పోలేదు. అయితే అలాంటి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కావడంతో ఆయన గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ విషయంలో ఎన్టీఆర్ తర్వాత ఆ ఘనత సాధించిన ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి అంటూ ఒక విషయం మెయిన్ మీడియా, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ విషయం ఏంటంటే.. సొంత పార్టీ స్థాపించి 70 సీట్లు గెలిచిన ఘనత.అయితే సీనియర్ ఎన్టీఆర్ సినిమాల నుండి రాజకీయాల్లోకి వచ్చినపుడు సొంత పార్టీ పెట్టి 202 సీట్లు గెలిచారు. అలా సొంత పార్టీ స్థాపించి సొంతంగా 70 సీట్లుకు పైగా సాధించిన సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఈ ఘనత సాధించిన ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి.

ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గాంధీ గారి తర్వాత జైలులో దీక్ష చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కింది.గాంధీ గారిలాగే జగన్మోహన్ రెడ్డి కూడా జైల్లో ఉన్న సమయంలో దీక్ష చేశారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన జైల్లో దీక్ష చేశారు. అంతేకాకుండా వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన సమయంలో ఓదార్పు యాత్ర చేసిన ఒకే ఒక్కడు కూడా జగన్మోహన్ రెడ్డినే. ఇక జగన్మోహన్ రెడ్డి సాధించిన మరో అరుదైన రికార్డు ఏంటంటే.. ఆయన ప్రజా సంకల్ప యాత్ర చేసిన సమయంలో కొన్ని బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. అలా బహిరంగ సభలు ఏర్పాటు చేసిన సభలకి దాదాపు 75 లక్షల మంది హాజరై బహిరంగ సభను సక్సెస్ఫుల్ చేశారు. అలా జగన్ మోహన్ రెడ్డి సాధించిన రికార్డులో ఇది కూడా ఒకటి.

మరింత సమాచారం తెలుసుకోండి: