పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన రీసెంట్ యాక్షన్ డ్రామా చిత్రం ‘ఓజి’ . ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్‌ను నమోదు చేసుకుని బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు ప్రతిభావంతుడైన దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహించగా, పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ను పవర్‌ఫుల్ యాక్షన్ మోడ్‌లో చూసిన అభిమానులు సినిమాను తెగ ఎంజాయ్ చేశారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, స్టైల్, డైలాగ్ డెలివరీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు. భారీ బడ్జెట్‌తో, ఉన్నత స్థాయి టెక్నికల్ విలువలతో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన అన్ని ప్రాంతాల్లో మంచి కలెక్షన్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సులు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ డిజైన్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందాయి.


ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని మూవీ విడుదల సమయంలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో అప్పట్లోనే అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల ‘ఓజి’ సీక్వెల్‌ను ప్రస్తుతం తెరకెక్కించడం లేదని మేకర్స్ స్పష్టత కూడా ఇచ్చారు. ఆ ప్రకటనతో అభిమానులు కొంత నిరాశకు గురయ్యారు. అయితే, తాజాగా ఈ సీక్వెల్ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన టాక్ సినీ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది. దర్శకుడు సుజిత్ ఈ సీక్వెల్‌ను ఎలాగైనా తెరకెక్కించాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నాడట. ఈ నేపథ్యంలోనే ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఈ ప్రాజెక్ట్‌ను ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై ప్రాథమిక చర్చలు కూడా జరిగినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.



ఈ వార్తతో పవర్ స్టార్ అభిమానుల్లో ఒక్కసారిగా ‘ఓజి’ సీక్వెల్‌పై ఆసక్తి మరింత పెరిగింది. యూవీ క్రియేషన్స్ మటే అందరికి ప్రభాస్ నే గుర్తు వస్తాడు. ఒక్కవేళ్ల సాహో-ఓజీ లని ఇన్వాల్వ్ చేస్తూ ఓకీ 2 లో ప్రభాస్ ని చూపిస్తే..ఇక రచ్చ రంబోలానే. అయితే  నిజంగానే ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ ప్రొడ్యూస్ చేస్తుందా? పవన్ కళ్యాణ్ మళ్లీ ఈ పాత్రలో కనిపిస్తారా? ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్లనుంది? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు వస్తున్నాయి.ఈ అన్ని ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం రావాలంటే మాత్రం మేకర్స్ నుంచి వచ్చే అధికారిక ప్రకటన వరకు అభిమానులు ఓపికగా వెయిట్ చేయాల్సిందే. అప్పటివరకు ఈ వార్తలు కేవలం ఊహాగానాలుగానే భావించాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: