ఒక దేశానికి తన కరెన్సీ ఉంటే, ఆ దేశాన్ని ప్రపంచం గౌరవంతో చూస్తుంది. కరెన్సీతో పాటు జాతీయ పతకం, జాతీయ గీతం, భాష, సంస్కృతి వంటి అంశాలు కలిసి ఆ దేశానికి పూర్తి గుర్తింపును ఇస్తాయి. అందువల్ల, కరెన్సీ ఒక దేశ గౌరవానికి, ప్రతిష్టకు చిహ్నం అని చెప్పవచ్చు.ప్రపంచంలో కరెన్సీ లేని దేశం ఏదైన ఉంది అంటే..అ ది లైఖ్టెన్స్టెయిన్ . ఇది చిన్న దేశమే కానీ అత్యంత అభివృద్ధి చెందిన దేశం . యూరప్ ఖండంలోని స్విట్జర్లాండ్ మరియు ఆస్ట్రియా మధ్య సుందరమైన పర్వతాల మధ్యలో ఉంది. సుమారు 160 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ దేశం ప్రపంచంలోని అతి చిన్న దేశాల్లో ఒకటిగా నిలుస్తుంది. లైఖ్టెన్స్టెయిన్కు స్వంత కరెన్సీ లేదు. స్విట్జర్లాండ్ కరెన్సీ అయిన స్విస్ ఫ్రాంక్ ను అధికారిక కరెన్సీగా ఉపయోగిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం కూడా ఈ దేశంలో లేదు. అందుకే అంతర్జాతీయ ప్రయాణాల కోసం స్విట్జర్లాండ్ లేదా ఆస్ట్రియా విమానాశ్రయాలనే ఆధారపడతారు. రవాణా, వాణిజ్యం, పర్యాటక రంగాల్లో ఈ రెండు పొరుగు దేశాలతో లైఖ్టెన్స్టెయిన్ సత్సంబంధాలు కొనసాగిస్తోంది.
ఈ దేశం రాజకీయంగా, ఆర్థికంగా చాలా స్థిరంగా ఉంటుంది. ప్రజలలో విద్య, క్రమశిక్షణ, నైతిక విలువలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. శాంతి, భద్రత పరంగా ప్రపంచంలో అత్యుత్తమ దేశాల జాబితాలో ఎల్లప్పుడూ టాప్లో నిలుస్తుంది. ఇక్కడ నేరాలు దాదాపు లేవనే చెప్పాలి. చాలా మంది తమ ఇళ్లకు తాళం వేయాల్సిన అవసరం కూడా అనిపించదు, ఎందుకంటే ఇక్కడి ప్రజలు ఒకరినొకరు విశ్వసించే అద్భుతమైన మానవ సంబంధాలు కలిగి ఉంటారు.బ్యాంకింగ్ రంగంలో లైఖ్టెన్స్టెయిన్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడి ఆర్థిక వ్యవస్థ చాలా సుస్థిరంగా ఉంటుంది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో ఈ దేశం విశ్వసనీయతకు పేరుపొందింది. పన్ను విధానం కూడా సాఫీగా ఉండటంతో అనేక అంతర్జాతీయ కంపెనీలు తమ ప్రధాన కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాయి.
అలాగే అత్యాధునిక సాంకేతిక రంగాల్లో, ముఖ్యంగా సూక్ష్మ భాగాల తయారీలో లైఖ్టెన్స్టెయిన్ ప్రపంచ నాయకుడిగా గుర్తింపు పొందింది. చిన్న దేశం అయినా, పరిశ్రమలు, టెక్నాలజీ అభివృద్ధి, విద్య, జీవన ప్రమాణాలు వంటి అంశాల్లో ఈ దేశం చాలా ముందుంది. తక్కువ జనాభా ఉన్నప్పటికీ, తెలివైన నిర్ణయాలు తీసుకోవడంలో, సుస్థిర ఆర్థిక విధానాలను అమలు చేయడంలో లైఖ్టెన్స్టెయిన్ ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. సహజ సౌందర్యం, స్వచ్ఛమైన వాతావరణం, ప్రజల స్నేహపూర్వక స్వభావం—అన్ను ఈ దేశాన్ని ప్రపంచంలోని అత్యంత ప్రశాంతమైన, సమృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా నిలబెట్టాయి.
 
             
                             
                                     
                                             క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి
 క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి