ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది దొంగలు పోలీసుల వేశంలో దాడులు చేస్తూ వస్తున్నారు.. ఉద్యోగులమని, ఆఫీసర్ల మంటూ దోపిడీలకు పాల్పడుతున్నారు. ఈ ఘటనలు పోలీసులకే షాక్ ఇస్తున్నాయి. వీటిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నా కూడా మరో ఘటన జరగడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన  హైదరాబాద్ లో ఆలస్యం గా వెలుగు చూసింది..మేడ్చల్‌లో నివాసముంటున్న నిర్మల్‌కు చెందిన అఖిల్‌ అహ్మద్‌తో పాటు నిజామాబాద్‌ ప్రాంతానికి చెందిన షేక్‌ అహ్మద్‌, షేక్‌ అజీమ్‌ లు పేకాట ఆడుతుండే వారు. ఆటలో ఎప్పుడూ డబ్బులు పోగొట్టుకుంటున్న అఖిల్‌, షేక్‌ అహ్మద్‌, షేక్‌ అజీమ్‌లు ఓ పథకం వేశారు.
 

అందులో భాగంగా ఈ నెల 14న సాయంత్రం మణికంఠ, శ్రీహరి, సాయ్‌సంగ్‌లను మేడ్చల్‌కు రప్పించి పట్టణంలోని ఆర్‌ఆర్‌ లాడ్జ్‌లో పేకాట ఆడుతున్నారు. ఆ సమయంలో గణేశ్‌ , షేక్‌ కైసర్‌ పోలీసుల వేషధారణలో లాడ్జ్‌లోకి రాగా బయట షేక్‌ అక్బర్‌ కాపలా ఉన్నాడు. లాడ్జ్‌లోపలికి వచ్చి వారు గది తలుపు తట్టి హడావిడి చేయగా పేకాట ఆడుతున్న అఖిల్‌ పోలీసులు వచ్చారని అరువడంతో, షేక్‌ అహ్మద్‌ వెళ్లి తలుపు తీశాడు. పోలీసుల వేషంలో వచ్చిన గణేశ్‌ డమ్మీ తుపాకితో బెదిరించగా, అతని తో పాటుగా వచ్చిన కైసర్‌ లాఠీతో బెదరకొట్టాడు..


అనుకున్న పథకం ప్రకారం అందులో ఒకరు వారి దగ్గర ఉన్న డబ్బులను తీసి మంచం మీద వేసాడు.. అందరూ భయపడి వారి దగ్గర ఉన్న డబ్బులను తీసి మంచం పై వేశారు.మొత్తం రూ.2.22లక్షలను తీసుకుని పోలీసుల వేషధారణలో వచ్చిన గణేశ్‌, కైసర్‌లు బెడ్‌షీట్‌లో మూటకట్టుకున్నారు. అనంతరం అందరిని మోకాళ్ల పై నిలబెట్టి ఈ విషయం తమ ఉన్నతాధికారులతో చెప్పి తగిన చర్యలు తీసుకుంటామని డబ్బులు తీసుకుని వెళ్లారు. అనంతరం తాము మోసపోయామని తెలుసుకున్న మణికంఠ, శ్రీధర్‌, సాయ్‌సంగ్‌లు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా వారితో పాటు అప్పటి వరకు ఉన్న అఖిల్‌, అహ్మద్‌, అజీమ్‌లు భయమేస్తుందని చెప్పి మెల్లగా జారుకున్నారు.. పోలీసుల విచారణ జరిపి అసలు గుట్టును బయటపెట్టారు. ఇలాంటి ఘటనలు నగరంలో అక్కడక్కడా జరగడం కలకలం రేపుతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: