
గతంలో కూడా క్యాంపా కోలా అనే శీతల పానీయాలతో మార్కెట్లో ఒక సంచలనం సృష్టించిన రిలయన్స్ ఇప్పుడు వాటర్ బిజినెస్ లో కూడా అడుగులు వేస్తోంది. రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్షన్ లిమిటెడ్ తయారు చేస్తున్నటువంటి ఈ నీటిని.. నీటిని రివర్స్ ఆస్మాసిస్, యువి ట్రీట్మెంట్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మరి శుద్ధి చేస్తున్నారట. ఈ నీరు రుచి, ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉండడమే ముఖ్యమైన ఉద్దేశంతో అన్ని ఖనిజాలను కూడా ఈ నీటిలో కలుపుతామంటూ తెలియజేస్తున్నారు రిలయన్స్ సంస్థ.
ఎటువంటి కార్యక్రమాలైనా, ప్రయాణాలైనా, రోజు వారి అవసరాలు తీర్చడానికి కూడా ఈ నీటిని ఉపయోగించుకునే విధంగా పర్యావరణానికి అనుకూలంగా పెట్టి బాటిల్లో ప్యాక్ చేస్తారట. ప్రస్తుతం బిస్లేరి, ఆక్వాఫినా, కిన్లే మరికొన్ని బ్రాంచ్ ఒక లీటర్ నీటిని రూ .20 రూపాయలకి అమ్ముతున్నాయి. రిలయన్స్ అదే బాటిల్ రూ .15 రూపాయలకే అందిస్తుంది. రెండు లీటర్ల బాటిల్ రూ .25 రూపాయలకి అమ్ముతుందట. దీంతో ఈ ధరల వ్యూహంతో మార్కెట్లో సరికొత్త సంచలనం రేపడం ఖాయనే విధంగా తెలియజేస్తున్నారు నిపుణులు. రిలయన్స్ రాకతో ప్యాకేజ్డ్ వాటర్ మార్కెట్లో కూడా దిగ్గజ బ్రాండ్లకు గట్టి పోటీ ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం వాటర్ బాటిల్ల పైన విధించే జిఎస్టిని 18 నుంచి 5% తగ్గించారు.