ఇటీవలి కాలంలో మనిషి ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. ముఖ్యంగా నేటి రోజుల్లో చిన్నచిన్న కారణాలకే క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది తప్ప ఎక్కడా తగ్గడం లేదు అని చెప్పాలి. ఎవరు కూడా మనుషుల ప్రాణానికి కాస్తయినా విలువ ఇవ్వడం లేదు. చాక్లెట్ తిన్నంత  ఈజీగా ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. టీచర్ తిట్టిందని తల్లిదండ్రులు మందలించారని లేదా ప్రియురాలి తో గొడవ జరిగిందని ఇలా చిన్నచిన్న కారణాలకే ఇక అక్కడితో జీవితం అయిపోయింది అని భావిస్తూ ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.


 ఇక మరి కొంతమంది ఇతర కారణాలతో తనువు చాలిస్తున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఇష్టం లేని పెళ్లి చేశారు అన్న కారణంతో ఒక నవ వధువు బలవన్మరణానికి పాల్పడి తనువు చాలించింది.  కాళ్ల పారాణి ఆరకముందే కానరాని లోకాలకు వెళ్లిపోయింది నవ వధువు. ఇక నవ వధువు ఆత్మహత్యకు పాల్పడటంతో ఇరు కుటుంబాల్లో కూడా విషాదాన్ని మిగిల్చింది అని చెప్పాలి. ఈ విషాదకర ఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరి కి చెందిన  ఏకాంతం చెర్లపల్లి లోని ఈసీ నగర్ లో తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. అయితే అతడి కుమార్తె శైలజ ఉప్పల్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తూ ఉండటం గమనార్హం. ఇకపోతే ఈ నెల 17వ తేదీన మేనల్లుడు సతీష్తో కుమార్తె వివాహం జరిపించాడు తండ్రి.


 ఇకపోతే పెళ్ళయిన కొన్ని రోజులకే ఇటీవలే భార్యాభర్తలిద్దరూ కూడా ఈ సి నగర్ కు వచ్చారు. ఇటీవలే భర్త సతీష్ ఎప్పటిలాగానే ఉద్యోగానికి వెళ్లగా.. ఇక బెడ్రూంలో తల్లి ఉండగా శైలజా బయటి నుంచి గడి పెట్టుకుని హాల్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.  అయితే తలుపు తెరవక పోటో చుట్టుపక్కల ఉన్న వారిని పిలిచి తలుపులు పగలగొట్టి చూడగా శైలజ వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా చివరికి మృతి చెందింది అని వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే వివాహానికి ముందు తనకు మేన భావతో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని శైలజ చెప్పినప్పటికీ తల్లిదండ్రులు వినకుండా పెళ్లి చేశారని అందుకే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు..

మరింత సమాచారం తెలుసుకోండి: