
ఖమ్మం లో నివాసం ఉంటున్న బానోత్ కిషోర్ అనే ఉపాధ్యాయుడు మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం లో పని చేస్తున్నాడు. ఇక అతని భార్య కూడా టీచర్ కావడం గమనార్హం. ఈమె కూడా డోర్నకల్ సమీపంలో ఉండే ఒక స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తూ ఉంది. అయితే ఖమ్మం లో నివసించే మరో ఉపాధ్యాయురాలు డోర్నకల్ మండలం లో టీచర్ గా పనిచేస్తూ ఉంటుంది. ఈమె రోజు డోర్నకల్ వరకు రైల్లో వెళ్లడం అక్కడి నుంచి ద్విచక్రవాహనంపై పాఠశాలకు హాజరవడం చేస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఎప్పటినుంచో ఇక ఈ కామాంధుడైన ఉపాధ్యాయుడు ఆమెపై కన్నేశాడు. ఎలాగైనా అనుభవించాలి అని అనుకున్నాడు.
చివరికి అదను కోసం చూశాడు. పక్కా ప్లాన్ ప్రకారం.. ఇటీవలే పాఠశాలలకు ఒంటిపూట బడులు నేపథ్యంలో విధులు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లేందుకు డోర్నకల్ రైల్వే స్టేషన్లో రైలు కోసం ఎదురుచూస్తున్న టీచర్ వద్దకు వెళ్ళాడు. తన భార్య కూడా ఉందని ముగ్గురం కలిసి ఖమ్మం కారులో వెళ్దాం అంటూ నమ్మించాడు. ఈ క్రమంలోనే ఇక సదరు ఉపాధ్యాయుడు భార్య కూడా ఉందని నమ్మి టీచర్ కారు ఎక్కింది. అదే అదనుగా భావించిన టీచర్ ఖమ్మం పాండురంగాపురంలో పాల్పడ్డాడు. బయటకు చెబితే చంపేస్తానని బెదిరించటం కూడా పాల్పడ్డారు. కొన్నాళ్ల తర్వాత ధైర్యం తెచ్చుకుని తనకు జరిగిన అన్యాయాన్ని భర్తకు చెప్పింది. ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.