
మద్యం మత్తులో ఏకంగా నడి బజారులో గందరగోళం సృష్టించాడు అని చెప్పాలి. ఫుల్లుగా మద్యం తాగి తాను ఏం చేస్తున్నాడో కూడా తెలియని విధంగా విచక్షణ కోల్పోయాడు. ఏకంగా చేజేతులారా ప్రాణాల మీదికితెచ్చుకున్నాడు అని చెప్పాలి. ఏకంగా ఒక హోర్డింగ్ కు వేలాడుతూ నానా హంగామా చేశాడు. ఇక ఆ తర్వాత ట్రాఫిక్ అంతరాయం ఏర్పడగా స్థానికులు అతని ఎంతో చాకచక్యంగా కాపాడారు అని చెప్పాలి. పోలీసులు ఇక న్యూసెన్స్ క్రియేట్ చేశాడు అతని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేశారు.
సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత మాట్లాడుతూ.. ఆ వ్యక్తి పూర్తిగా మధ్యమధ్యలోనే ఉన్నాడని.. అంతే తప్ప ఇది డబుల్ బెడ్ రూమ్ గురించి లేదా ఇంకా ఏదైనా దాని గురించి కాదని.. అతనిపై న్యూ సెన్స్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే అప్పటికే ఇక అతను వేలాడుతున్న స్థానంలో స్కూల్ వ్యాన్ నిలిపి ఉంచడంతో పెద్ద ప్రమాదం తప్పింది అని చెప్పాలి. ఏకంగా సదరు వ్యక్తి బిల్ బోర్డు ఫ్రేమ్ నుంచి వేలాడుతూ సదరు స్కూల్ వ్యాన్ మీద పడ్డాడు. దీంతో గాయాలు లేకుండానే తప్పించుకున్నాడు అని చెప్పాలి.ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది.