
సాధారణంగా స్టార్ హీరోలు పెద్ద సినిమాల్లో రిస్క్ తక్కువగా తీసుకునేలా డూప్స్ వాడటం కామన్. కానీ మహేష్ మాత్రం రాజమౌళి కోసం, ఈ ప్రాజెక్ట్ కోసం తన శరీరాన్ని, టైమ్‌ని సంపూర్ణంగా అంకితం చేస్తున్నాడట. ఇక మహేష్ ఈ డెడికేషన్ చూసి జక్కన్న కూడా ఆశ్చర్యపోయాడట. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్‌ను గ్లోబల్ లెవెల్‌లో నిలబెట్టాలని రాజమౌళి ప్లాన్ చేస్తుండగా, హీరో కూడా అదే స్థాయిలో హార్డ్ వర్క్ చేస్తుండటం ఆయనను సంతోషపరచిందట. మహేష్ చేసిన ప్రతి సీన్ రా అవుట్ చూడగానే యూనిట్‌లో వర్క్ చేసే వారందరూ షాక్ అవుతున్నారని సమాచారం. అంతేకాదు, ఈ ప్రాజెక్ట్ నుంచి ఒక బిగ్ రివీల్ వచ్చే నవంబర్‌లో ప్లాన్ చేసినట్టు మేకర్స్ ఇప్పటికే సూచించారు. ఆ గ్లింప్స్ లేదా టీజర్ కోసం కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మహేష్ బాబు కొత్త లుక్, యాక్షన్ స్టైల్, రాజమౌళి క్రియేటివ్ విజన్ - అన్నీ కలిపి ఒక ప్యాకేజ్‌గా రావడం ఖాయం. సినిమా గురించి ప్రస్తుతం మేకర్స్ ఎలాంటి అధికారిక క్లారిటీ ఇవ్వకపోయినా, ఇది ఒక గ్లోబల్ అడ్వెంచర్ డ్రామా అని బజ్ వినిపిస్తోంది. విదేశీ షెడ్యూల్స్ సైలెంట్‌గా ముగుస్తుండటంతో ఈ సినిమా స్కేల్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఏదేమైనా.. మహేష్ బాబు డూప్ లేకుండా రిస్కీ సీన్స్ స్వయంగా చేయడం ఆయన ఫ్యాన్స్‌కు గర్వకారణమే కాకుండా, ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న హైప్‌ను మరింత రెట్టింపు చేసింది. ఇప్పుడు అభిమానులు మాత్రం నవంబర్‌లో రాబోయే ఆ బిగ్ రివీల్ కోసం కౌంట్‌డౌన్ మొదలుపెట్టేశారు! మహేష్ బాబు – రాజమౌళి కాంబో.. గ్లోబల్ రేంజ్ మాస్ హంగామా ఖాయం!