
ఏకంగా మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అన్న విషయాన్ని ఇంకా గుడ్డిగా నమ్ముతూ వున్నారు జనాలు. ఇక ఇలాంటి నమ్మకాన్ని క్యాష్ చేసుకుంటున్న బురిడీ బాబాలు జనాలను మోసం చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయ్. ఇటీవల గుంటూరు జిల్లాలో కూడా ఇలాంటి ఘటన జరిగింది. పొన్నే కల్లుల్లో ఒక నకిలీ పూజారి మహిళలతో నగ్న పూజలు నిర్వహించిన ఘటన సంచలనంగా మారిపోయింది. నగ్నంగా పూజలు చేస్తే డబ్బులు వస్తాయి అంటూ యువతులను గుడ్డిగా నమ్మించాడు ఓ పూజారి. ఈ క్రమంలోనే పూజలు చేశాడు.ఇలా పలు లాడ్జీలలో నగ్న పూజలు చేసిన నకిలీ పూజారి అనంతరం ఆ యువతులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రతిఘటించిన యువతులను పూజ మధ్యలోనే వెళ్లిపోతే డబ్బులు రావటం నమా బలికి మరి అత్యాచారం చేశాడు.
అయితే పూజ పూర్తయిన తర్వాత మాత్రం ఇక సదరు నకిలీ పూజారి చెప్పినట్లుగా డబ్బులు రాకపోవడంతో.. ఇక మోసపోయాము అని అర్థం చేసుకున్న యువతులు.. పోలీసులకు సమాచారం అందించారు. దిశా యాప్ ద్వారా యువతులు పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పాలి. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పోలీసులు చిలకలూరిపేటకు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.