తమ కంటి ముందు ఎంత అన్యాయం జరిగినా, అధర్మం జరిగినా పట్టించుకోని పరిస్థితుల్లో కనిపిస్తున్నారు జనాలు. ఇలాంటి అన్యాయం తనకు జరిగితే తనకు ఎవరూ సహాయం చేయలేదని బాధపడతారు. అంతేగాని పక్క వాడికి అపాయం వచ్చినప్పుడు కూడా ఆ వ్యక్తి అలాగే సహాయం కోరుకుంటాడు అని మాత్రం అర్థం చేసుకోరు.


మొన్న ఢిల్లీలో అందరూ చూస్తుండగానే ఒక పదహారేళ్ల అమ్మాయిని ఒక యువకుడు కత్తితో పొడిచి చంపేస్తున్న సరే ఆ చుట్టుపక్కల జనం ఎవరూ రెస్పాండ్ అవ్వకపోవడం, అమ్మాయిని కాపాడకపోవడం చాలా దారుణం. ఆదివారం ఢిల్లీలో సాక్షి అనే  పదహారేళ్ల అమ్మాయిని సాయి అనే వ్యక్తి 45 సార్లు కత్తితో పొడిచి పొడిచి మరీ చంపాడట. అయినా కూడా చుట్టుపక్కల ఎవరూ అమ్మాయిని కాపాడడానికి ముందుకు రాలేదట.


కత్తితో పొడిచిన తర్వాత కూడా అమ్మాయిని క్రూరంగా మళ్ళీ రాయితో కొట్టి మరీ తల పగలగొట్టాడంట ఆ పైసాచిక వ్యక్తి. అయితే ఇంత దారుణం చేసి కూడా ఆ వ్యక్తి తాను చేసిన పనికి పశ్చాత్తాప పడకపోవడం ఇక్కడ మరింత దారుణం. అసలు ఎందుకు ఇదంతా చేశాడు అంటే కోర్టులో ఆ వ్యక్తి చెప్పింది విని అందరూ షాక్ కి గురయ్యారట. తాను ఆ అమ్మాయితో 3 సంవత్సరాల నుండి డేటింగ్ లో ఉంటున్నానని, అయితే ఆ అమ్మాయి కొంతకాలంగా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో సన్నిహితంగా మెలుగుతుందని చెప్పాడు.


అది నచ్చకే తాను అమ్మాయిని చంపేశానని దానికి తాను పశ్చాత్తాప పడడం లేదని చెప్పాడట. సాయిని బులందహార్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అని తెలుస్తుంది.  పగ పెంచుకొని పథకం ప్రకారమే సాయి 15 రోజులు ముందే కత్తిని కొన్నాడని పోలీసులు చెప్పారు. అంతేకాకుండా గతంలో జరిగిన సంఘటనను బట్టి ఒక ముస్లిం వ్యక్తి ఒక హిందూ మహిళను చంపిన సంఘటనకు సంబంధించి  అది పెద్ద విషయం కాదు అన్నట్లుగా చెప్పుకొచ్చారట మరీ దారుణంగా.

మరింత సమాచారం తెలుసుకోండి: