ఏంటో.. ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత మనిషి జీవితం ఇంతేనా అనే భావన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. ఎందుకంటే అనూహ్యమైన  రీతిలో మనిషి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. చూస్తూ చూస్తుండగానే మనిషి కళ్ళముందే కుప్పకూలిపోయి క్షణాల వ్యవధిలో  ప్రాణాలు కోల్పోతున్నాడు. అయితే పక్కనే ఎంతమంది ఉన్నా ఎంతలా ప్రయత్నించినా కూడా ఇక మనిషి ప్రాణాలను నిలబెట్ట లేకపోతున్నాడు అని చెప్పాలి. మొన్నటి వరకు కరోనా వైరస్ ఎక్కడ ప్రాణాలు తీసేస్తుందో అని అందరు భయపడిపోయారు.


 ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బ్రతికారు. కానీ ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావం తగ్గిందని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో సడన్ హార్ట్ ఎటాక్లు ప్రాణాలు తీసేస్తున్నాయి. ఆరోగ్యంగా ఉండి ప్రతిరోజు వ్యాయామం చేస్తూ.. ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించేవారు సైతం ఇలా సడన్ హార్ట్ ఎటాక్ల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో సడెన్ హార్ట్ ఎటాక్ లు ఎందుకు వస్తున్నాయి.. అసలు ఇలా జరగడానికి కారణాలు ఏంటి అన్నది తెలియక ప్రతి ఒక్కరూ భయం గానే దిన దినగండంగా బ్రతుకును వెల్లడిస్తున్నారు అని చెప్పాలి. ఇక ఇలా సడన్ హార్ట్ ఎటాక్ల కారణంగా పోతున్న ప్రాణాలు రోజురోజుకి ఎక్కువ అవుతుండడంతో అందరిలో ప్రాణం పై తీపి మరింత పెరిగిపోతుంది. ఇటీవల మనోహరాబాద్ మండలంలో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. నాచారం లలిత అనే 45 ఏళ్ల మహిళ సడెన్ హార్ట్ ఎటాక్ తో మృతి చెందింది. శివంపేట మండలం అల్లిపూర్ లో మనవరాలు బర్త్ డే వేడుకలకు హాజరైంది లలిత. ఇకపోతే ఇటీవలే మధ్యాహ్నం సమయంలో కుటుంబ సభ్యులందరితో కూడా ఒకచోట కూర్చొని సరదాగా మాట్లాడుతుంది. ఈ సమయంలో ఒక్కసారిగా స్పృహ కోల్పోయింది లలిత. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: