సాధార‌ణంగా ఏ మహిళైనా తాను తల్లిని కాబోతున్నాన్న విషయం తెలియగానే ఆనందంతో ఉప్పొంగిపోతోంది. ఆమె సంతోషానికి అవధులు ఉండవు. ఎందుకంటే తల్లి అవ్వడం అనేది ప్రతి ఒక్క మహిళ జీవితంలోనూ గొప్ప వరం. దీనికోసం ఎంతో మంది స్త్రీలు ఎదురుచూస్తుంటారు. వివాహం అయిందంటే చాలు.. తమ కడుపులో మరో ప్రాణాన్ని మోసేందుకు ఆరాటపడుతుంటారు. ఇక‌ ప్రెగ్నెన్సీ మ‌హిళ ఆహారపు అలవాట్ల నుంచి ధరించే దుస్తువుల వరకు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది.

 

అయితే  ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచీ బిడ్డ పుట్టే వరకూ కూడా చక్కెర వాడటం మానేయమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రెగ్నెన్సీ మహిళలు చక్కెరతో చేసిన పదార్ధాలు తినడం వలన పుట్టబోయే బిడ్డకి కొన్ని రకాల జబ్బులు వస్తాయని కొన్ని పరిశోధనలో తేలింది. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ మ‌హిళ‌లు చ‌క్కెర తీసుకోవ‌డం వ‌ల్ల‌ అలర్జీలతో, ఆస్తమా, ఊబకాయం వంటి సమస్యలు వస్తాయట. 

 

ఇక అదే బెల్లంతో చేసిన పదార్థాలు తీసుకున్న తల్లులకు పుట్టిన పిల్లల్లో అలాంటి సమస్యలను గుర్తించలేదు. కాగా, పంచదార తిన్నప్పుడు మెదడులో బీటా ఎండార్ఫిన్లు ఉత్తేజితమవుతాయి. అందుకే మనకు ఆనందంగా అనిపిస్తుంది. కానీ.. ఎక్కువకాలంపాటు ఎక్కువ పంచదార తింటే శరీరాన్ని కాపాడే రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది. పంచదార ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తినడం వల్ల మళ్లీ త్వరగా ఆకలి కలుగుతుంది. షుగర్‌ ఎక్కువగా వినియోగించడం వల్ల శరీరం ఒత్తిడిని తట్టుకునే శక్తిని కోల్పోతుంది. కాబ‌ట్టి ప్రెగ్నెన్సీ మ‌హిళ‌లు చ‌క్కెర వాడ‌కం మానేయ‌డ‌మే బెట‌ర్‌..!!

 
   

మరింత సమాచారం తెలుసుకోండి: