ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. కుల్ఫీ ఎంత రుచికరంగా ఉంటుందో వేరే చెప్పాల్సిన పని లేదు. రుచికరమైన తియ్యని కుల్ఫీని తింటుంటే ప్రాణం జివ్వుమంటుంది. ఇక రుచికరమైన కుల్ఫీని మ్యాంగో ఫ్లేవర్ తో యాడ్ చేసుకోని తింటే వచ్చే మజానే వేరు.. చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళు దాకా  ఈ కుల్ఫీని ఎంతగానో ఇష్టపడతారు. ఇది ఐస్ క్రీమ్ కంటే కూడా చాలా టేస్టీగా కూల్ గా చాలా బాగుంటుంది...ఇక ఈ రుచికరమైన మ్యాంగో కుల్ఫీ ఎలా చెయ్యాలో తెలుసుకోండి...

మ్యాంగో కుల్ఫీ తయారీకి కావాల్సిన పదార్ధాలు..

పాలు - ఒక కప్పు మీద కాస్త ఎక్కువ, చిక్కగా మరిగించిన పాలు - పావు కప్పు, మామిడి గుజ్జు - అరకప్పు, చక్కెర - ఆరు స్పూనులు, యాలకుల పొడి - పావు చెంచా, మొక్కజొన్న పిండి - ఒక టీస్పూను

మ్యాంగో కుల్ఫీ తయారు చేసే విధానం...

ఓ గిన్నెలో పాలు, చక్కెర వేసి స్టవ్ మీద పెట్టాలి. వాటిని బాగా మరిగించాలి. మరిగి మరిగి... పాలు సగం అయిపోతాయి. అప్పుడు అందులో మొక్కజొన్న పిండి వేసి బాగా కలపాలి. అందులో చిక్కగా మరిగించిన పాలను కలపాలి. మంట తక్కువగా పెట్టి... బాగా ఉడికించారు. కలుపుతూ ఉండాలి. ఓ అయిదు నిమిషాల పాటూ అలా మరిగించాక యాలకుల పొడి వేసి స్టవ్ కట్టేయాలి. ఈ పాల మిశ్రమాన్ని ఓ మిక్సిగిన్నెలో వేయాలి. అందులో కప్పు మామిడి గుజ్జు కూడా కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. దీనికి కుల్ఫీ మౌల్డ్ లలో వేసుకుని డీప్ ఫ్రిజ్ లో అయిదు గంటలపాటూ ఉంచాలి. అంతే మామిడి కుల్ఫీ రెడీ.ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాలు ఎలా చెయ్యాలో తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: