అందులో పవన్, రీతూ చౌదరి జంట కూడా వచ్చారు. మొదటి ఫెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది ఈ జంట. ముఖ్యంగా హాట్ సాంగ్ తో హాట్ డాన్స్ తో రెచ్చిపోయి మరి డాన్స్ వేసినట్లు వైరల్ గా మారుతోంది. ఇందుకు సంబంధించిన ప్రోమోని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా రీతు చౌదరి, పవన్ మధ్య ఉన్న తమ ప్రేమను సైతం ఈ డాన్స్ షోలో బయటపెట్టినట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా వీరిద్దరి మధ్య రొమాంటిక్ డాన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీంతో అభిమానులు కూడా వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ వైరల్ గా చేస్తున్నారు.
ఈ షోలో మిగతా కంటెస్టెంట్ తో కూడా గొడవ పెట్టుకున్నట్టు కనిపిస్తోంది రీతూ. ముఖ్యంగా తన డాన్స్ బాగా లేదన్న నయని పావనికి, మరి కొంతమందికి కౌంటర్లు వేస్తూ గట్టిగానే సమాధానాలు ఇచ్చింది రీతూ చౌదరి. మొత్తానికి చూస్తే బీబీ జోడీలో అటు రీతూ చౌదరి, డిమాన్ పవన్ జంట అందరికీ కాంపిటీషన్ ఇచ్చేలా కనిపిస్తున్నారు. ఇందులో జడ్జిగా సదా, శేఖర్ మాస్టర్ తో పాటు హీరోయిన్ శ్రీదేవి కూడా జడ్జిగా వ్యవహరిస్తున్నారు. హొస్టుగా యాంకర్ ప్రదీప్ వ్యవహరించారు. ప్రస్తుతం ఈ ప్రోమో అయితే వైరల్ గా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి