ఏపిలో వ్యభిచారం చేసే వారి సంఖ్య నానాటికీ పెరుగుతూ వస్తుంది.. విశాఖ, విజయవాడ,శ్రీకాకుళం జిల్లాల్లో ఈ వ్యభిచారం పడగ విప్పుతుంది. కానీ , ఇప్పుడు కొత్తగా గుంటూరు లో కూడా చీకటి దందాలు దర్శనమిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. గుంటూరు నగరంపాలెం పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెస్ట్‌ సబ్‌ డివిజన్‌ డీఎస్పీ కె. సుప్రజ వివరాలు వెల్లడించారు. గుంటూరు ఏటీ అగ్రహారం జీరో (0) లైను లో నివాసం ఉండే షేక్‌ లాల్‌బీ అలియాస్‌ శ్రీలక్ష్మి, ఇంట్లోనే శ్రీలక్ష్మి మ్యాచింగ్‌ సెంటర్‌ పేరుతో చిన్నపాటి వస్త్ర దుకాణం నడుపుతోంది.


పదేళ్ల కిందట ప్రైవేట్‌ ట్రావెల్స్‌ లో పనిచేసే శ్రీనివాసరావును వివాహం చేసుకుంది. అప్పటికే విలాసాలకు అలవాటు పడిన శ్రీలక్ష్మి సులువుగా డబ్బు సంపాదించాలనే దురాచలోన తో మ్యాచింగ్‌ సెంటర్‌ ముసుగు లో వ్యభిచారం నిర్వహిస్తోంది. షాప్ లో వస్త్రాలను కొనుక్కోవడానికి వచ్చే యువతుల ను , మహిళల ను మచ్చిక చేసుకొని వ్యాపారం చేసేది.. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడి కి వచ్చి ఉంటున్న యువతులను మభ్యపెట్టి వారిని చీకటి కూపంలోకి దింపి వ్యభిచారం చేయిస్తోంది.


 పక్కా సమాచారం తో నగరం పాలెం పోలీసులు ఈ నెల 17వ తేదీ రాత్రి ఏటీ అగ్రహారంలోని ఆమె నివాసంలో దాడి చేసి నిర్వాహకురాలిని, ముగ్గురు యువతులను, విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.5 వేల నగదు, మూడు ద్విచక్ర వాహనాలు, మూడు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇటువంటి వ్యభిచార గృహాలు ఉంటే డయల్‌ 100, లేక వెస్ట్‌ డీఎస్పీ ఫోన్‌ నంబర్‌ 86888 31330కు సమాచారాన్ని అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని మీడియా సమావేశంలో పేర్కొన్నారు.. అంతేకాదు అలా చెప్పిన వారికి  సీక్రెట్ గా ప్రైజ్ మనీ కూడా ఇస్తున్నట్లు ప్రకటించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: