దేశ రాజ‌ధాని ఢిల్లీలో జ‌రిగిన నిర్భ‌య ఘ‌ట‌న ఎంత పెద్ద ప్రకంప‌న‌లు సృష్టించిందో చూశాం. ఆ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికీ దేశం భ‌గ్గుమంటూనే ఉంది. అదొక్క‌టే రెండేళ్ల క్రితం తెలంగాణ‌లో జ‌రిగిన ఎంత పెద్ద సంచ‌ల‌నంగా మారిందో విన్నాం. అయినా స‌రే ఇప్ప‌టికి కూడా ఇలాంటి సామూహిక అత్యాచారాలు ఆగ‌ట్లేదు. ఇప్పుడు బెంగుళూరులో ఇలాంటి ఘ‌ట‌నే ఉలిక్కిప‌డేలా చేస్తోంది.



అయితే ఈ ఘ‌ట‌న ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సరిగ్గా ఆరు రోజుల క్రితం బెంగళూరులోని ఎన్‌ఆర్ఐ కాలనీలో 22 ఏళ్ల యువతిపై నలుగురు యువకులు అత్యంత దారుణంగా అత్యాచారం చేశారు. ఇక్క‌డ మరో దురదృష్టకర ఘ‌ట‌న ఏంటంటే.. ఆ దుర్మార్గులు యువ‌తిని అత్చాచారం చేస్తుంటే..మరో యువ‌తి వారికి  సహకరించింది. ఆ నలుగురు యువకులు, యువతి బంగ్లాదేశ్ నుంచి బెంగళూరు వచ్చి అక్రమంగా నివాసముంటున్నట్టుగా పోలీసుల విచారణలో బ‌య‌ట ప‌డింది.





వీరంతా ఒకటే గ్యాంగ్‌. ఇంత‌కు ముందు వీరు క‌లిసి నగరంలో ముఠాగా ఏర్పడి వ్యభిచారం చేయించేవారు. ఇక గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన యువకులతో పాటు వారికి సహకరించిన స‌ద‌రు యువతిని కూడా పోలీసులు త‌మ అదుపులోకి తీసుకున్నారు. వీరిపేర్లు సాగర్, మహ్మద్ బాబా షేక్, రిదై బాబు, హకీల్‌గా పోలీసులు గుర్తించారు. వారంద‌రినీ క‌స్ట‌డీలోకి తీసుకుని పూర్తి వివ‌రాలు సేక‌రిస్తున్నారు.


ఈ ముఠా ఎన్‌ఆర్‌ఐ కాలనీలోనే నివాసముంటున్నట్టు పోలీసుల విచార‌ణలో తేలింది. అయితే క‌రోనా కార‌ణంగా ఇంట్లోనే ఉంటున్న వీరు.. త‌మ రూమ్‌కు ద‌గ్గ‌ర్లో నివాసం ఉంటున్న ఓ 22 ఏళ్ల యువతిని బ‌ల‌వంతంగా త‌మ రూమ్‌కు లాక్కెళ్లి.. చిత్రహింసలకు గురిచేశారు. అత్యంత పాశ‌వికంగా అత్యాచారం చేశారు. ఇదంతా మ‌రో యువ‌తి వీడియోతీసి సోష‌ల్ మీడియాలో పెట్ట‌డంతో వైర‌ల్ గా మారింది. దీంతో పోలీసులు విష‌యం తెలుసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా బాధిత యువ‌తి నుంచి ఎలాంటి కంప్ల‌యింట్ రాలేద‌ని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: