దొంగలు చాలా రకాలు.. కొంతమంది ఏం పని చేసుకోవాలో తెలియక చివరికి దొంగతనమే ఉద్యోగం అనుకుంటూ ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతూ అందినకాడికి దోచుకో పోతుంటారు. ఇంకొంతమంది మంచి ఉద్యోగం ఉన్నప్పటికీ ఇక జల్సాలకు అలవాటుపడి శాలరీ సరిపోక దొంగలుగా మారుతూ ఉంటారు. ఇంకొంతమంది వీళ్లు బాగా వెరైటీ. వీళ్లకు దొంగలుగా మారాల్సిన అవసరమే ఉండదు. కానీ నచ్చిన వారికి గిఫ్ట్ ఇచ్చేందుకు డబ్బుల్లేక చివరికి దొంగలుగా మారి కటకటాల పాలవుతూ ఉంటారు. ఇక్కడ ఇలాంటి కష్టం వచ్చింది ఒక భర్త కి. చివరికి దొంగ గా మారిపోయాడు.



 సాధారణంగా భార్య పుట్టినరోజు ని ఎంతో ఘనంగా జరపడానికి భర్తలు ప్లాన్ చేస్తూ ఉంటారు. అంతేకాదు ఇక భార్య పుట్టినరోజు నాడు ఆమెకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి సంతోష పరచాలి అని అనుకుంటూ ఉంటారు. చాలా మటుకు భర్తలు భార్య పుట్టినరోజు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక భర్త ఇలాంటి ప్లాన్ చేసాడు. ఏకంగా ఒక ఖరీదైన చీరను భార్య పుట్టినరోజు నాడు బహుమతిగా ఇవ్వాలని అనుకున్నాడు.  అయితే ఇలా బహుమతి ఇవ్వాలని అనుకోవడంలో  తప్పు లేదు కానీ.. భార్యకు పుట్టినరోజు బహుమతి ఇచ్చేందుకు చివరికి దొంగతనం చేశాడు ఇక్కడ ఒక వ్యక్తి. చివరికి పోలీసులకు దొరికి కటకటాలపాలయ్యాడు.


 ఈ ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది భార్యకు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చేందుకు ఖరీదైన చీరను దొంగలించాడు భర్త. ఉజ్జయినిలోని చీరల దుకాణంలో రాత్రి సమయంలో చొరబడిన విక్కీ అనే దొంగ కత్తితో బెదిరించి ఖరీదైన చీరలు ఎత్తుకెళ్లాడు. అయితే అక్కడ సీసీటీవీలో అంతా రికార్డు అవుతుంది అన్న విషయాన్ని మాత్రం గ్రహించలేకపోయాడు. ఇక వెంటనే ఆ షాపింగ్ మాల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సిసిటివి ఫుటేజీ ఆధారంగా పరిశీలించిన పోలీసులు అతను పాత నేరస్తుడు అని గమనించి చివరికి అతన్ని అరెస్టు చేసి కటకటాల వెనక్కి తోసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: