ఇలాంటి ఘటనలు మళ్లీ అసలు పునరావృతం కాకూడదు అంటూ అందరూ కోరుకుంటున్నారు. ఇక చిన్నారి చైత్ర కు జరిగిన ఘటనపై అందరూ ఎంతో విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో చిన్నారి చైత్ర పై జరిగిన అత్యాచారం హత్య ఘటన మరవకముందే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చి సంచలనంగా మారిపోయింది. సైదాబాద్ అత్యాచార ఘటన మరువక ముందే మరో ప్రాంతంలో అత్యాచార ఘటన కలకలం సృష్టించింది. ఇటీవలే హైదరాబాద్ నగరంలోని మంగల్ హాట్ పరిధిలో ఒక బాలికపై అత్యాచారం జరిగింది.
బాలికను సుమిత్ అనే యువకుడు రేప్ చేసినట్లు ఇటీవలే బయటపడింది. అయితే నిన్న రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. బాలిక అరుపులతో సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు పారిపోయేందుకు ప్రయత్నించిన సుమిత్ ను పట్టుకొని పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. నిందితుడిపై పోక్సో చట్టం లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు జైలుకు తరలించారు. ఇక వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆసుపత్రికి తరలించారు. ఇలా చైత్ర ఘటన మరువక ముందే మరో అత్యాచార ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగులోకి రావడం సంచలనంగా మారిపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి