ఒకప్పుడు పోలీసులను చూస్తే జనాలు భయపడేవారు.  కానీ ఇటీవలి కాలంలో మాత్రం పూర్తిగా పరిస్థితులు మారిపోయాయి.  పోలీసు వ్యవస్థపై ప్రతి ఒక్కరిలో అవగాహన పెరిగి పోయింది. అటు పోలీసులు కూడా ప్రజల్లో పోలీసుల పై ఉన్న భయాలను పోగొట్టడానికి ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని కూడా తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజలందరికీ దగ్గరగా ప్రజల సమస్యలను పరిష్కరించడమే ద్యేయంగా ప్రస్తుతం ఎంతో మంది పోలీసులు పని చేస్తున్నారు అని చెప్పాలి. అయితే  ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అప్రమత్తంగా ఉంటున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే ఇటీవలే ఒక మహిళకు సమస్య తలెత్తగా కేవలం గంటల వ్యవధిలోనే పరిష్కరించారు.


 వేగంగా మహిళా సమస్యలు పరిష్కరించి ప్రస్తుతం ప్రశంసలు అందుకుంటున్నారు పోలీసులు.  కడప జిల్లా ప్రొద్దుటూరులో ఓ మహిళ బంగారం పోగొట్టుకుంది. దీంతో ఎంతో బాధపడుతున్న ఆ మహిళకు పోలీసులు సమస్యను పరిష్కరించారు. బంగారం ని వెతికి పెట్టారు. పొద్దుటూరు పట్టణంలోని రెడ్ల కళ్యాణ మండపం మార్గమధ్యంలో 50 వేల రూపాయల బంగారు డాలర్ ను బైక్ ఫై వెళ్తున్న మహిళ పోగొట్టుకుంది  ఇక బంగారు డాలర్ కనిపించకపోవడంతో వెంటనే కమాండ్ కంట్రోల్ సెంటర్ కి ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది మహిళా. ఇక ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలోనే ఎర్రగుంట్ల బైపాస్ రోడ్డు మార్గంలో పూర్తిగా బంగారు డాలర్ల కోసం గాలించారు. ఈ క్రమంలోనే తీవ్రంగా శ్రమించి బంగారు డాలర్ ను వెతికి గుర్తించారు పోలీసులు. ఇక ఆ తర్వాత బాధితురాలికి ఆ డాలర్ ను తిరిగి అప్పగించడం గమనార్హం ఈ క్రమంలోనే ఆ మహిళ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి. తాను పోగొట్టుకున్న విలువైన బంగారు డాలర్ ను మళ్ళీ తిరిగి అప్పగించిన పోలీసులకు సదరు బాధిత మహిళ కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఇలా ఫిర్యాదు అందుకున్న వెంటనే స్పందించి వెంటనే మహిళ పోగొట్టుకున్న బంగారు డాలర్ వెతికి పెట్టిన కమాండ్ కంట్రోల్ రూమ్ పోలీసులను కడప ఎస్పీ అభినందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: