అదేసమయంలో ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చింది అంటే చాలు ఇక తమకు ఎవరో ఏదో చేశారని లేదా గాలి సోకింది అని భావిస్తూ హాస్పిటల్ కి వెళ్ళకుండా బురిడి బాబాల దగ్గరికి వెళ్తు చివరికి భారీగా ఖర్చు పెడుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయ్. అంతేకాదు రుద్ర పూజలు చేస్తున్నారు అన్న అనుమానంతో ఎంతోమంది మానవత్వాన్ని మరిచి పోయి దారుణంగా హత్యకు పాల్పడిన ఘటనలు కూడా అందరినీ ఒక్క సారిగా ఉలిక్కి పడేలా చేస్తున్నాయి.. ఇక ఇలాంటి తరహా ఘటన ఎక్కడ జరిగింది. చేతబడి చేస్తుంది అనే అనుమానంతో 70 ఏళ్ల వృద్ధురాలిని 22 ఏళ్ల యువకుడు దారుణంగా కత్తితో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన పంజాబ్లోని లూధియానాలో వెలుగులోకి వచ్చింది
లుధియానా శివారులోని మెహర్ బంద్ ప్రాంతంలో కౌర్ అనే వృద్ధురాలు ప్రార్థనల కోసం గురుద్వార్ కి బయలుదేరింది. అయితే ఇటీవలే ప్లాన్ ప్రకారం యువకుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు. చేతబడి చేసి మనుషుల ప్రాణాలు తీస్తావా అంటూ ఏకంగా దారుణంగా కత్తితో పొడిచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన కౌర్ అనే వృద్ధురాలు చివరికి అక్కడికక్కడే రక్తపుమడుగులో ప్రాణాలు వదిలింది. వృద్ధురాలి కుమారుడు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఇలా హత్యకు పాల్పడింది జస్పాల్ సింగ్ అనే యువకుడడు అనీ పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి