ఈ సృష్టికి మూలమైన మహిళ నేటి రోజుల్లో ఆడపిల్లలు గా పుట్టడమే మేము చేసిన పాపమా అని అనుక్షణం బాధపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే నేటి సమాజంలో మానవత్వం ఉన్న మనుషుల కంటే కామంతో ఊగిపోతున్న మనుషుల ఎక్కువై పోతున్నారు. కను చూపు మేరలో ఆడపిల్ల కనిపిస్తే చాలు దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మహిళలకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఎక్కడా పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడంలేదు. రోజురోజుకీ ఆడపిల్లల జీవితం ప్రశ్నార్థకంగానే మారిపోతుంది.


 దీంతో ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటే ఆడపిల్ల భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇటీవలి కాలంలో అయితే ఏకంగా సొంతింట్లో వాళ్ళే ఆడ పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో తన బాధను ఎక్కడ చెప్పుకోవాలో కూడా తెలియక ఆడపిల్ల అనుక్షణం బాధపడుతూనే బ్రతుకు  వెళ్ళదీయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక్కడ ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లికి ఆరోగ్యం బాగాలేదని ఆసుపత్రికి వచ్చిన ఒక బాలిక పై కామంధుడి కన్నుపడింది. దీంతో రెచ్చిపోయి అత్యాచారానికి పాల్పడ్డాడు.


 కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.. దామన్ జిల్లాలోని మార్వాడి ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్యం బారినపడిన తల్లి కి తోడుగా ఉండేందుకు వచ్చింది 11 ఏళ్ల బాలిక. అయితే అక్కడే సెక్యూరిటీ గార్డు రూపంలో ఒక కామాంధుడు కాచుకు కూర్చున్నాడు అన్న విషయాన్ని ఆ బాలిక గమనించలేక పోయింది. ఇక మాయమాటలతో నమ్మించి ఆ బాలికను మక్కువ చేసుకున్నాడు సెక్యూరిటీ గార్డు. తల్లికి దప్పిక వేయడంతో తాగునీటి కోసం వెతుకుతుంది ఆ చిన్నారి. ఈ క్రమంలోనే దారి చూపిస్తానంటూ గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఆస్పత్రికి ఆ గది కాస్త దూరంగా ఉండటంతో చిన్నారి అరిచినా ఎవరికీ అరుపులు వినిపించలేదు. ఆ తర్వాత గదిలోనుంచి బాలిక ఏడుస్తూ రావడాన్ని గమనించిన స్థానికులు ఏం జరిగింది అని అడుగగా  అసలు విషయం బయటపడింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: