పూర్తి వివరాలోకు వెళ్తే.. శివపురి జిల్లా బదర్వాస్ ప్రాంతంలోని కియోస్క్ ఆపరేటర్ విజయ్ సింఘాల్ ఇంట్లో రూ.45 లక్షల దొంగతనం జరిగింది. అయితే విజయ్ సింఘాల్ ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిన ఏటీఎంను నిర్వహిస్తున్నారు. ఇక ఏటీఎం అమర్చిన దుకాణం నుండి ఇంటికి వెళ్లేందుకు దారి ఉంటుంది. కాగా.. గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఏటీఎంలో ఏదో లోపం జరిగిందని, డబ్బు నిలిచిపోయిందని తన ఫోన్‌కు కాల్ వచ్చిందని ఆ వ్యాపారి చెప్పుకొచ్చారు.
అయితే విజయ్ కి కిందకు రాగానే.. ముసుగులు వేసుకున్న ముగ్గురు దుండగులు అతడిని కిడ్నప్ చేశారు. ఇక అతడిని తుపాకీ చూపించినా ఆ వ్యాపారితో పాటు ఇంట్లోకి వెళ్ళాడు. ఆ వ్యాపారి దగ్గర ఉన్న రూ. 45 లక్షల నగదును తీసుకెళ్లారు. ఆ దుండగులు వెళ్తూ వెళ్తూ మరో దారుణానికి పాల్పడ్డారు. బాధితుడు పోలీసులుకు ఫిర్యాదు చేయకుండా ఉండేందుకు అతడి భార్యను నగ్నంగా మర్చి వీడియోలను చిత్రీకరించారు.
ఇక ఒక్కవేళ దుండగుల గురించి పోలీసులుకు చెప్తే ఆ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బాధితుడిని బెదిరింపులకు గురి చేశాడు. ఆ వ్యాపారి ఇంట్లో సీసీ టీవీ ఫుటేజ్ ఉండటంతో అందులో చిత్రీకరించారు. ఆ తరువాత దుండగులు సీసీ టీవీ ఫుటేజ్ ని పోలీసులు తమతో పాటు తీసుకెళ్లారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యవతు చేపట్టారు. బాధితుల నుండి సమాచారం తీసుకున్న పోలీసులు దుండగులు పక్క ప్లాన్ ప్రకారమే చేశారని అనుమానం వ్యక్తం చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి