వివరాల్లొకి వెళితే.. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ కడప లో వెలుగు చూసింది.. కడప టౌన్‌కు చెందిన శివ, షేర్ ఖాన్ స్నేహితుల మధ్య ఓ ఫంక్షన్‌లో మాంసం ముక్కల కోసం గొడవ జరిగింది. తనకు షేర్ ఖాన్ ముక్కలు తక్కువ వేశాడని శివ ఘర్షణ పడ్డాడు. క్షణికావేశంతో షేర్ ఖాన్‌ను కత్తితో గాయపరిచాడు. అయితే అక్కడ ఉన్న వాళ్లంతా అడ్డుకోవడం తో గొడవ సర్దు మనిగింది. కాగా, షేర్ మాత్రం అతని పై కక్ష్య పెట్టుకున్నాడు.. ఓ రోజు ఫోన్ చేసి రమ్మని పిలిచాడు.. అతను అది నిజమని నమ్మి వెళ్లాడు. అక్కడే ట్విస్ట్ జరిగింది.
అతను అక్కడికి వెళ్ళగానే గొడవ పడ్డాడు. మాటా మాటా పెరగడంతో అతని తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు..ఆవేశంతో ఊగిపోయిన షేర్ ఖాన్ కత్తితో శివ గొంతు కోసం హత్య చేశాడు. హత్యానంతరం తన స్నేహితుల సాయంతో శివ మృతదేహాన్ని ఆటోలో తీసుకెళ్లి కేసీ కేనాల్ కాలువ పక్కన పడేశాడు. శివ హత్యపై కేసు నమోదు చేసిన కడప టూ టౌన్ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇలా మటన్ కోసం గొడవలు పడటం అందరికి ఆలోచనలొ పడవెసింది.. ప్రస్తుతం ఈ ఘటన కలకలం రేపుతోంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి