ఈ పాడు లోకం లో నేను ఆడపిల్లగా పుట్టడమే చేసిన పాపమా.. ఆడపిల్ల ఎంతో గొప్పది ఈ సృష్టికి మూలమైనది.. ఇక మానవ మనుగడకు ప్రధానమైనది అని చెబుతూ ఉంటారు..  అలాంటి ఒక ఆడపిల్ల అయినా నాకు ఇక ఈ లోకంలో రక్షణ లేదా.. అనుక్షణం భయపడుతూ బ్రతకాల్సిందేనా.. ఇలా ప్రస్తుత కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత ప్రతి ఆడపిల్ల బాధ పడుతున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా అటు ఆడపిల్ల ఎక్కడో ఓ చోట లైంగిక వేధింపులు ఎదుర్కొంటూనే ఉంది. రోడ్డు మీద వెళ్తే ఆకతాయిల నుంచి బడికి వెళ్తే ఉపాధ్యాయుల నుంచి ఉద్యోగానికి వెళితే సహోద్యోగుల నుంచి అడుగడుగునా లైంగిక వేధింపులతో దుర్భర జీవితాన్ని గడుపుతుంది ప్రతి ఆడపిల్ల.



 అయితే ఇక మరికొంతమంది కనుచూపు మేరలో ఆడపిల్ల కనిపించింది అంటే చాలు దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది. ఏకంగా ఓ యువతిపై అదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఏపీ లోని శ్రీకాకుళంలో వెలుగులోకి వచ్చింది. గూడెం గ్రామానికి చెందిన ఓ యువకుడితో ప్రేమలో ఉంది యువతి. అయితే కొద్ది రోజుల క్రిందట ఆమె బంధువుల ఇంటికి వెళ్లేందుకు బయలుదేరింది. ప్రియుడికి ఈ విషయాన్ని చెప్పింది. అయితే తాను డ్రాప్ చేస్తానంటూ తియ్యగా  మాట్లాడి నమ్మించాడు సదరు యువకుడు.


 ఈ క్రమంలోనే ఇక ఆ యువతిని బైక్ పై ఎక్కించుకుని ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం ఇక ముగ్గురు స్నేహితులు ఉన్న ప్లేస్ కి తీసుకు వెళ్ళాడు. ఇక ఆ తర్వాత బలవంతంగా పొదల్లోకి లాక్కెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. అయితే ఇలా యువతిపై అత్యాచారానికి పాల్పడిన వారిలో ఒక మైనర్ బాలుడు కూడా ఉన్నాడు అన్నది తెలుస్తుంది. ప్రస్తుతం బాధితురాలు రిమ్స్ లో చికిత్స పొందుతుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా ఈ ఘటన కాస్తా స్థానికంగా సంచలనం గా మారిపోయింది.  ఘటన తర్వాత ఇక ఇంటి నుంచి కాలు బయట పెట్టాలి అంటే ప్రతి ఆడపిల్ల స్థానికంగా భయపడిపోయే పరిస్థితి వచ్చింది..

మరింత సమాచారం తెలుసుకోండి: