మూడుముళ్ల బంధంతో ఒక్కటై ఏడడుగులు నడిచిన దాంపత్య బంధంలోకి అడుగు పెట్టిన యువతీ యువకులు ఇక వందేళ్ల పాటు కష్టసుఖాలు పంచుకుంటూ ఒకరంటే ఒకరు ప్రాణంగా బతుకుతూ ఉంటారు. అందుకే అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ దాంపత్య బంధం అని చెబుతూ ఉంటారు. ఇక పెళ్లి తర్వాత  ఎంతోమంది సరి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ ఇటీవలి కాలంలో మాత్రం ఎంతోమంది ఒక పెళ్లితో సరిపెట్టుకోకుండా రెండు మూడు పెళ్లిళ్లు చేసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తమనే నమ్ముకొని పుట్టింటిని వదిలి మెట్టినింట్లో అడుగు పెట్టిన వారిని చివరికి నట్టేట ముంచేస్తున్నారు ఎంతోమంది.


 రహస్యంగా  మరో పెళ్లి చేసుకుంటూ ఇక కట్టుకున్న భార్యlకు షాక్ ఇస్తున్న వారు కూడా నేటి రోజుల్లో ఎక్కువై పోతున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. తన భర్త తనను కాదని రెండో పెళ్ళికి సిద్ధమయ్యాడు అంటూ ఓ మహిళ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటన కర్నూలు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. కోవెలకుంట్ల కు చెందిన మెహబూబ్ బీ కి ఆళ్లగడ్డ మండలానికి చెందిన నాగరాజుకు ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ళ పాప కూడా ఉంది. కొన్నాళ్ళ వరకు బాగానే ఉన్నా వీరీ దాంపత్య జీవితంలో మనస్పర్థలు మొదలయ్యాయి. దీంతో వీరి మధ్య ఉన్న వివాదం కాస్త కోర్టులో కేసు వరకు వెళ్ళింది. ఇక ఇంతలోనే నాగరాజు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు.


 ఈ క్రమంలోనే ఇటీవలే ఎస్ ఆర్ గ్రాండ్ హోటల్ లో పెళ్లి రిసెప్షన్ చేసుకుంటున్న సమయంలో నాగరాజు మొదటి భార్య తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే బంధువులు అందరితో కలిసి అక్కడే ఆందోళనకు దిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే తన మొదటి భార్యకు తలాక్ చెప్పిన తర్వాతనే రెండవ వివాహం చేసుకున్నానని నాగరాజు వాదిస్తూ ఉండటం గమనార్హం. అయితే తాను తలాక్ అంగీకరించలేదని నాగరాజు మొదటి భార్య చెబుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: