అత్త మీద కోపం దుత్త మీద చూపించిందని ఒక సామెత గురించి దాదాపు అందరికి తెలిసే ఉంటుంది. ఇటీవలి కాలంలో అయితే ఈ సామెతకు సరిగ్గా సరిపోయే ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. ఒకరి మీద కోపాన్ని మరొకరు మీద చూపిస్తూ ప్రతాపాన్ని తీర్చుకుంటున్నారు ఎంతో మంది మనుషులు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. అల్లుడు మీద ఉన్న కోపాన్ని ఆయన స్నేహితుడు బైక్ మీద చూపించాడు ఒక మామ. చివరికి బైక్ను పెట్రోల్ పోసి దహనం చేసేసాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది.


 ఈ ఘటనతో స్థానికులు అందరూ కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు అనే చెప్పాలి.  వివరాల్లోకి వెళితే.. యూసుఫ్ గూడా  సమీపంలోని ఫస్ట్ బెటాలియన్ ప్లాట్ నెంబర్ 522 వద్దకు జగద్గిరిగుట్ట లోని ఎలక్ట్రీషియన్గా పనిచేసేవాడు పాండు అనే వ్యక్తి. తన స్నేహితుడు శ్రీనివాస్ ను కలిసేందుకు వెళ్ళాడు. అయితే ఇద్దరూ కలిసి మద్యం తాగి వచ్చి ఇంటి బయట ఉన్న ఇసుక లో నిద్ర పోయారు. అదే సమయంలో ఇక శ్రీనివాస్ మామ నాగయ్య అల్లుడు మీద ఉన్న కోపం స్నేహితుడు పాండు ద్విచక్ర వాహనం మీద చూపించాడు. ఏకంగా బైక్ పై పెట్రోల్ పోసి దహనం చేశాడు. అయితే ఒక్కసారిగా మంటలు అంటుకొని శబ్దాలు రావడంతో మెలుకువ వచ్చిన పాండు అక్కడికి వెళ్లి చూడగా బైక్ పూర్తిగా కాలిపోతుంది.


 ఇక అక్కడి నుంచి వస్తూ నాగయ్య కనిపించాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన పాండు తన బైక్ ని ఎందుకు కాల్చేశావ్ అంటూ నాగయ్యను నిలదీశాడు. నా అల్లుడు మీద కోపంతో ఇలా చేశా అంటూ చెప్పడంతో పోలీసులను ఆశ్రయించాడు పాండు. తన బైక్ కాల్చివేసిన నాగయ్య పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాగయ్య ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: