ప్రేమించి పెళ్ళి చేసుకున్న భర్త తన కోరిక తీర్చలేదని నిరాశతో ఆత్మహత్య చేసుకుంది.. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లొకి వెళితే.. వికారాబాద్ జిల్లా సంగెం గ్రామానికి చెందిన రాజు, స్వాతిలు పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఫిబ్రవరిలో వివాహం జరిగింది.తర్వాత పెద్దలను ఎదిరించి వేరే కాపురం పెట్టారు. ప్రేమించి చేసుకున్న జంట అన్యొన్యంగా ఉంటారని అందరు అనుకున్నారు.రాజు శంకరపల్లిలో ఓ హోటల్ లో పని చేస్తున్నాడు. మొన్న రాత్రి సెకండ్ షో సినిమాకు వెళదామని స్వాతి అడిగింది.దానికి రాజు వద్దని చెప్పాడు.
ఖచ్చితంగా తీసుకెల్లాలని ఆమె అడిగింది. కానీ అతను నిరాకరించారు. తర్వాత ఎప్పుడైనా వెలదామని చెప్పాడు. కానీ తను ఎంత చెప్పినా వినలేదు.. ఇద్దరి మధ్య ఘర్షణ ఏర్పడినది. మాటా మాటా పెరిగింది. కారణంగా మనస్తాపానికి గురైన స్వాతి.. నిన్న రాజు ఇంటిలో లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అమ్మాయి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి