ఐపీఎల్ మొదలైందంటే చాలు క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు ఐపీఎల్ మ్యాచ్ లను చూసి తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా ఐపీఎల్ మొదలైందంటే అటు బెట్టింగ్ మాఫియా కూడా రెచ్చి పోతూ ఉంటుంది. ముఖ్యంగా యూత్ ని టార్గెట్ చేసుకుంటూ ఇక బెట్టింగ్ రాయుళ్లు రెచ్చి పోతూ ఉంటారు. అటు పోలీసులు బెట్టింగ్ మాఫియా పై ఎంతలా నిఘా ఏర్పాటు చేసినప్పటికీ ఏదో ఒక విధంగా బెట్టింగ్ దందా కొనసాగించడం లాంటివి చేస్తూ ఉంటారు.


 ఇక భారీగా డబ్బులు వస్తాయని ఆశ చూపి ఎంతోమంది బెట్టింగ్ లోకి దింపి చివరికి అప్పుల పాలు చేసి బలవన్మరణాలకు పాల్పడే పరిస్థితి తీసుకు వస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. దీంతో ఇటీవల కాలంలో ఎంతో మంది కుర్రాళ్ళు బెట్టింగ్ లకు బానిసలుగా మారిపోతున్నారు. ఈ క్రమంలోనే ఇంట్లో చెప్పకుండా అప్పులు చేసి మరీ చివరికి బెట్టింగ్ లో భాగం అవుతూ ఉండడం గమనార్హం. ఇక్కడ బెట్టింగ్ పెట్టడం ఒక యువకుడి ప్రాణం పోవడానికి కారణం అయ్యింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.


 బూర్గంపాడు పాండవ గుట్ట బస్తీకి చెందిన సాయి కిషన్ అనే యువకుడు ఇటీవలే ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.. ఐపీఎల్ బెట్టింగ్ కి బానిస గా మారిపోయిన ఈ యువకుడు దాదాపు 50 లక్షల రూపాయలు అప్పు చేసినట్లు తెలుస్తోంది. డబ్బులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి ఎక్కువవడం.. అతని కుటుంబానికి కూడా చెల్లించే స్థోమత లేకపోవడంతో మనస్థాపంతో చివరికి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు అందరూ చేతికొచ్చిన కొడుకు విగతజీవిగా మారడంతో బోరున విలపిస్తున్నారు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అతనికి అప్పు ఇచ్చిన వారు ఎవరు.. బెట్టింగ్ లో ఎవరెవరు బట్టి నిర్వహించారు అన్న విషయంపై కూడా ఆరా తీస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl