జబర్దస్త్ కంటెస్టెంట్స్ తో తనకి ఉన్న బాండింగ్ గురించి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తనకు గౌరవం ఇస్తారని,ప్రతి ఒక్కరు ఆప్యాయంగా మాట్లాడతారని తెలిపింది. సుధీర్ నాకు కొడుకు లాంటి వారు ,సుధీర్ తో బాండింగ్ దేవుడిచ్చిన బంధం అయ్యి ఉంటుంది అంటూ తెలిపింది ఇంద్రజ. ప్రస్తుతం అమ్మాయిలు వేసుకుంటున్న డ్రెస్సింగ్ స్టైల్ పైన యాంకర్ వర్ష అడగగా? ఇంద్రజ మాట్లాడుతూ.. చాలామంది ఇది నా డ్రెస్సింగ్ నా ఇష్టం అని చెబుతూ ఉంటారు. మీ పర్సనల్ ప్లేస్ లో మీరు ఏవైనా చేసుకోండి కానీ పబ్లిక్ ప్లేస్ లో వచ్చినప్పుడు కచ్చితంగా కామెంట్స్ చేస్తారని.. ఇది చాలా వివరంగా మాట్లాడుకోవాల్సిన సబ్జెక్ట్ అంటూ ఇంద్రజ తెలియజేస్తుంది.
అలాగే ప్రస్తుతం ఉన్న జనరేషన్ బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతారు.. ఈ విషయం పైన మీ అభిప్రాయం ఏంటి అంటూ యాంకర్ వర్ష అడగగా?.. అందుకు ఇంద్రజ మాట్లాడుతూ నార్మల్ డెలివరీ ఇచ్చేటప్పుడు వచ్చే పెయిన్ చాలా బాధ అంటారు కదా.. అంతకు ఈక్వల్ గా ఉండేటువంటి పెయిన్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా ప్రేమలో మోసపోవడమే..అది చేసినవాళ్లు మగవారైనా ఆడవారైనా సరే వాళ్లకి పుట్టగతులు ఉండవు, సర్వనాశనం అయిపోతారు అంటూ ఇంద్రజ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి. అందుకు సంబంధించి ప్రోమో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి